Kamareddy: సెట్లూరులో ప్రయాణికుల కోసం చలి వేంద్రం ఏర్పాటు
Kamareddy: కామారెడ్డి జిల్లా సెట్లూరు గ్రామంలో మండుతున్న ఎండల నేపథ్యంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో చలి వేంద్రం ఏర్పాటు చేశారు.
Kamareddy
Kamareddy: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం సెట్లూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ కాళోజీ విఠల్ ఆధ్వర్యంలో చలి వేంద్రం ఏర్పాటు చేశారు. మండుతున్న ఎండల నేపథ్యంలో గ్రామ ప్రజలు, బాటసారులు, ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ఈ ఏర్పాట్లు చేశారు.
బిచ్కుంద – బిర్కూర్ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన చలి వేంద్రం ద్వారా ప్రయాణికులు తాగునీరు పొందుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రయాణికులు వెంటనే చల్లని నీరు తాగకుండా కొంతసేపటి తర్వాత నీరు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ సూచించారు.
గ్రామ ప్రజలు సర్పంచ్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు.
Next Story




