Kamareddy: క్వింటాలుకు రూ. 7721 మద్దతు ధర.. రైతులకు బాసటగా నిలిచిన ప్రభుత్వం

Kamareddy: కామారెడ్డి జిల్లా బిచ్కుందలో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు. క్వింటాలుకు రూ. 7721 మద్దతు ధర.

VEERANNA, JUKKAL
Published on: 23 April 2026 4:54 PM IST
Kamareddy
X

Kamareddy: క్వింటాలుకు రూ. 7721 మద్దతు ధర.. రైతులకు బాసటగా నిలిచిన ప్రభుత్వం

కామారెడ్డి జిల్లా: బిచ్కుంద మండల కేంద్రంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు మార్క్ పేడ్, రైతు సేవ సహకార సంఘం, బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని డి సి సి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ తో కలిసి ప్రారంభించారు.బిచ్కుంద మండలం లోని రైతులు ఆరుతడి పంట కింద పొద్దు తిరుగుడు పంటను సాగు చేశారు. సుమారుగా మండలంలో 1 వేయి ఎకరాలలో పొద్దు తిరుగుడు పంట సాగు చేయగా ప్రస్తుతం ఆ పంట చేతికి వచ్చింది. బయట వ్యాపారులు క్వింటాలుకు 5 వేల రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్న తరుణంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు కృషితో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

ప్రభుత్వం క్వింటాల్కు 7721 రూపాయలు ప్రకటించగా ఒక ఎకరానికి 6.61 క్వింటాల్ మాత్రమే కొనుగోలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.ఆరుగాలం కస్టపడి పండించిన పంట కు ప్రభుత్వం మద్దతు ధర కల్పించడం జరుగుతుందని రైతులు మధ్య దళారులను నమ్మి మోసపోకుండా తమ పంటను కొనుగోలు కేంద్రం వద్ద విక్రయించాలని రైతులకు సూచించారు.గురువారం కొనుగోలు కేంద్రం ప్రారంభం కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమం లో బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొంగల శంకర్, డైరక్టర్లు శివ సెట్, సాయిని అశోక్, మున్సిపల్ కౌన్సిలర్లు దర్పల్ గంగాధర్, నౌషా నాయక్, ముజాహిద్, సందని, పి సి సి డెలిగేట్ విఠల్ రెడ్డి, మాజి జెడ్పీ టి సి. నాగ్ నాథ్, పుల్కల్ సొసైటీ మాజీ ఛైర్మన్ వెంకట్ రెడ్డి పాటిల్, వాజిద్ నగర్ సర్పంచ్ దొడ్ల గోపాల్ రెడ్డి, ప్రేమ్ సెట్, భాస్కర్ రెడ్డి, అజీమ్, మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్, ఎఫ్ ఎ సి ఎస్ సి ఇ ఓ శ్రవణ్ కుమార్, మార్కెట్ కమిటీ కార్యదర్శి రాజ్ కుమార్ లతోపాటు రైతులు, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story