Yergatla: ఎర్గట్ల తాళ్ల రాంపూర్ సర్పంచ్ పావని కన్నుమూత
Yergatla: ఎర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ సర్పంచ్ బెజ్జరపు పావని గుండెపోటుతో ఆకస్మిక మృతి. గ్రామంలో విషాదఛాయలు, సంతాపం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు, నాయకులు.
Yergatla: ఎర్గట్ల తాళ్ల రాంపూర్ సర్పంచ్ పావని కన్నుమూత
ఎర్గట్ల: ఎర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామ సర్పంచ్ బెజ్జరపు పావని గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, గ్రామ ప్రజలతో కలిసిమెలిసి ఉండే వ్యక్తిగా పావనికి మంచి గుర్తింపు ఉంది. చిన్న వయసులోనే సర్పంచ్‌గా ఎన్నికై గ్రామాభివృద్ధికి కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందారు. అలాంటి వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందడాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేక తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఆమె మృతితో గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు తీవ్రవిషాదంలో మునిగిపోయారు.




