Banswada: బాన్సువాడ ఎస్ఆర్ఎన్కే కళాశాలలో కాళోజీ జయంతి వేడుకలు!

Banswada: బాన్సువాడ ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలలో తెలంగాణ భాషా దినోత్సవం, కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

SALEEM, BANSWADA
Published on: 9 Sept 2026 11:52 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడ ఎస్ఆర్ఎన్కే కళాశాలలో కాళోజీ జయంతి వేడుకలు!

బాన్సువాడ: ప్రభుత్వ ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ మరియు పీజీ కళాశాల అటానమస్ లో నేడు తెలంగాణ భాషా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు.. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందూర్ గంగాధర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు జరుపుకునే తెలంగాణ భాష దినోత్సవం కాళోజి జన్మదిన సందర్భంగా 2015 నుంచి జరుపుకుంటున్నామని గుర్తు చేశారు, అలాగే పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిదని, కాలోజీ ఆనాడే అన్నారని, ఆ విషయాన్ని గుర్తించి, దేశ సేవకు మన వంతు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

మన భాషలోని యాస మాండలికాల గుర్తింపుకు కాళోజి ఎంతగానో కృషి చేశారని అన్నారు తెలుగును అక్షర దోషం లేకుండా రాయాలని, మాతృభాష వస్తేనే ఇతర అన్నిభాషలు నేర్చుకోవచ్చని అని అన్నారు. ఈ కార్యక్రమం తెలుగు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ఐ క్యూ ఏ సి కోఆర్డినేటర్ వినయ్ కుమార్., ఉపన్యాసకులు గోపాల్, శ్రీనివాస్, మోహన్ రావు, పురుషోత్తం, బాల్ సింగ్, అనిత, రేఖ, పద్మ మరియు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.బాన్సువాడ

ప్రభుత్వ ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ మరియు పీజీ కళాశాల అటానమస్ లో నేడు తెలంగాణ భాషా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు.. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందూర్ గంగాధర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు జరుపుకునే తెలంగాణ భాష దినోత్సవం కాళోజి జన్మదిన సందర్భంగా 2015 నుంచి జరుపుకుంటున్నామని గుర్తు చేశారు, అలాగే పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిదని, కాలోజీ ఆనాడే అన్నారని, ఆ విషయాన్ని గుర్తించి, దేశ సేవకు మన వంతు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

మన భాషలోని యాస మాండలికాల గుర్తింపుకు కాళోజి ఎంతగానో కృషి చేశారని అన్నారు తెలుగును అక్షర దోషం లేకుండా రాయాలని, మాతృభాష వస్తేనే ఇతర అన్నిభాషలు నేర్చుకోవచ్చని అని అన్నారు. ఈ కార్యక్రమం తెలుగు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ఐ క్యూ ఏ సి కోఆర్డినేటర్ వినయ్ కుమార్., ఉపన్యాసకులు గోపాల్, శ్రీనివాస్, మోహన్ రావు, పురుషోత్తం, బాల్ సింగ్, అనిత, రేఖ, పద్మ మరియు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story