Nizamabad: ఊటీలో కమలం జెండా ఎగురవేసేందుకు ఆర్మూర్ కౌన్సిలర్ల పట్టుదల!
Nizamabad: తమిళనాడులోని ఊటీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి భోజరాజన్ తరపున ఆర్మూర్ బీజేపీ కౌన్సిలర్లు విస్తృత ప్రచారం నిర్వహించారు.
Nizamabad: ఊటీలో కమలం జెండా ఎగురవేసేందుకు ఆర్మూర్ కౌన్సిలర్ల పట్టుదల!
నిజామాబాద్ జిల్లా: తమిళనాడు స్టేట్ ఎన్నికల భాగంగా ఊటీ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల విషయంలో అక్కడున్న నీళగిరి డిస్టిక్ ఊటీ నియోజవర్గ ఎమ్మెల్యే గా అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ బోజరాజన్ బిజెపి పార్టీ తరపున నియోజవర్గంలో ఇతర పార్టీతో పోటీగా ఉన్నారు, ఈ ఎన్నికల ప్రచారంలో ఆర్మూర్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరపున ఇటీవల గెలిచిన బిజెపి కౌన్సిలర్స్ లు ఎమ్మెల్యే అభ్యర్థికి భోజరాజన్ కు మద్దతుగా ప్రచారం చేయడం జరిగింది.
బిజెపి కౌన్సిలర్ల యొక్క ప్రచారం:
ఆర్మూర్ నియోజవర్గం నుంచి ఇటీవల గెలిచిన బిజెపి కౌన్సిలర్లు తమిళనాడు ఊటికి వెళ్లి అక్కడ ఉన్న ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థులు మద్దతు తెలుపుతూ, భారీ మెజార్టీతో గెలిపిస్తూ ప్రధానమంత్రి మోడీకి గిఫ్ట్ గా ఇవ్వాలన్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాను ప్రధానమంత్రి అయినాక ఒక్కరోజు సెలవు తీసుకోకుండా, నాకు ప్రజలే ముఖ్యం అంటూ నిత్యం సేవా భవన్ తో ఉన్నాడు, మోడీ చేసిన అభివృద్ధిని గుర్తుచేసుకొని ప్రజలు అమూల్యమైన ఓటు బిజెపి పార్టీ పువ్వు గుర్తుకు వేయాలని అన్నారు.
ఊటీ బిజెపి పార్టీ ప్రచారంలో పాల్గొన్న కౌన్సిలర్లు :
ఈ ప్రచారంలో కార్యక్రమంలో పట్టణం మున్సిపాలిటీలో గెలిచిన కొన్ని వార్డులు బిజెపి పార్టీ కౌన్సిలర్ల ప్రచారం, పట్టణ నియోజకవర్గ బిజెపి కౌన్సిలర్స్ 1.బొట్టు రాజు, 2.యమాద్రి కవితభాస్కర్ 3.పాన్ శ్రీను 4. బొల్లం అనూష అరుణ్ 5. శ్రావణ్ కుమార్ 6. దొండి కవిత ఈశ్వర్ 7. ఖాందేశ్ ప్రశాంత్ 8. పోచంపాడు శ్రీను ఇట్టి ఎలక్షన్ కార్యక్రమంలో బిజెపి గెలుపు దిశగా విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది.




