Bichkunda: సెట్లూరు గ్రామ పంచాయతీ సిబ్బందికి సేఫ్టీ కిట్ల పంపిణి
Bichkunda: బిచ్కుంద మండలం సెట్లూరులో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు.
Bichkunda: సెట్లూరు గ్రామ పంచాయతీ సిబ్బందికి సేఫ్టీ కిట్ల పంపిణి
బిచ్కుంద: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా బిచ్కుంద మండలం సెట్లుర్ గ్రామ పంచాయతీ పరిశుద్ధ కార్మికులకు గ్రామ సర్పంచ్ కాళోజీ విఠల్ సేఫ్టీ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గ్రామ ప్రజల సమక్షంలో ఘనంగ నిర్వహించారు. జాతీయ పథకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
సెట్లూరు గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల చిరకాల స్వప్నం సాకారమైన రోజని ఆయన అన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజల అస్థిత్వాన్ని,ఆత్మగౌరవాన్ని గుర్తించి స్వరాష్ట్ర సాధనకై అసువులు బాసిన అమరుల త్యాగాలను గుర్తించి ఆనాడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అనుసరంగా సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటించడం జరిగిందని గుర్తు చేశారు. కార్యక్రమం లో గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




