Armoor: ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో జెండా పండగ!
Armoor: అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నేతలు, మున్సిపల్ చైర్‌పర్సన్ జాతీయ జెండా ఆవిష్కరణ. గ్రామ పంచాయతీల్లో సఫారీ సిబ్బందికి నూతన వస్త్రాల పంపిణీ.
Armoor: ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో జెండా పండగ!
ఆర్మూర్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ పట్టణ అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ మార్కెట్ కమిటీ చైర్మన్, పట్టణ అధ్యక్షుడు, మున్సిపల్ చైర్ పర్సన్, పలు మండలాల గ్రామంలో అడవి మామిడిపల్లి, చేపూర్, గాదెపల్లి, గుత్ప, మంథని, ఇంకా వివిధ గ్రామ సర్పంచ్ లు చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరించారు, అనంతరం అందరూ కలిసి జాతీయ గీతాన్ని పాడారు.
నియోజవర్గ కొన్ని గ్రామాల గ్రామపంచాయతీలో :
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సర్పంచ్, ఉప సర్పంచ్ చేతుల మీదుగా గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన బట్టలు, శానిటైజర్ కిట్లు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు,మున్సిపల్ చైర్ పర్సన్, వివిధ గ్రామ సర్పంచ్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుని 12 సంవత్సరాలు పూర్తయింది, మన యొక్క ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందరో త్యాగాలు చేశారు, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకంగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీకి ధన్యవాదములు తెలుపుతూ, దేశంలోనే అభివృద్ధి పథకాలలో ముందుందంటే అది మన తెలంగాణ రాష్ట్రమే అంటూ మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, వివిధ గ్రామ సర్పంచులు, గడ్డం చిన్న రెడ్డి,గొల్ల సాయన్న, భూమయ్య,శాంతి కుమార్, సాగర్ లత, మురళి, మహేష్, గ్రామ ఉపసర్పంచ్ లో,సెక్రెటరీలు,వార్డ్ మెంబర్లు అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.




