Jukkal: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Jukkal: జుక్కల్ నియోజకవర్గంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు, మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే పాల్గొన్న కార్యక్రమాలు.
Jukkal: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జుక్కల్ (కామారెడ్డి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మంగళవారం జుక్కల్ మండల కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు జాతీయ పథకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి,ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిస్తూ జుక్కల్ నియోజక వర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ రాష్ట్రం నేడు అభివృద్ధి,సంక్షేమ రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొంటూ,ప్రజల భాగస్వామ్యంతో మరింత ప్రగతి శిల తెలంగాణ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. బిచ్కుంద మున్సిపల్ పట్టణ పరిధిలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద గల తెలంగాణ అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహానికి బి ఆర్ ఎస్ మాజి ఎమ్మెల్యే హనుమంత్ షిండే, బి ఆర్ ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు కలిసి పూల మాలలు వేసి ఘన నివాళి అర్పించారు.
స్వప్నాలను సాకారం చేసుకున్న వీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత అభివృద్ధి,సంక్షేమం, సుభిక్షతతో తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ జుక్కల్ నియోజక వర్గ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం తెలంగాణ గీతాలాపన చేశారు.అమరుల త్యాగాలను స్మరించుకుంటూ 14 ఏళ్ళ ఉద్యమం 10 ఏళ్ల ప్రగతి పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడం జరిగిందని మాజి ఎమ్మెల్యే హనుమంత్ షిండే అన్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకోవడంలో అప్రమత్తంగా ఉండాలని పిలుపు నిచ్చారు.నియోజకవర్గం లోని గ్రామ గ్రామాన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న నాయకులు.
జుక్కల్ నియోజకవర్గం లొ నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా జుక్కల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సాయగౌడ్, రమేశ్ దేశాయ్,సతీష్ పాటిల్, ఫిర్దోష్, బి ఆర్ ఎస్ పార్టీ నేతలు బొల్లి గంగాధర్, వాస్రె రమేశ్, దాదారావు పాటిల్, గాజు గౌడ్, హైదర్, జాదవ్.సాయి కర్ణ, మజీద్, రజాక్, బొమ్మ లక్ష్మణ్, వెంకట్ రావు దేశాయ్, బస్వరాజ్ పాటిల్, ఆవారా శ్రీనివాస్, అన్నారం వెంకట్ రెడ్డి, నర్సగౌడ్, కవిత విజయ్, జొన్న ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బిచ్కుంద మున్సిపల్ చైర్ పర్సన్ సీమ సెట్కార్,వైస్ చైర్మన్,మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సబ్యులు బి ఆర్ ఎస్ పార్టీ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ ఉద్యమ కారులు రైతులు పాల్గొన్నారు.




