Kamareddy: కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ.. జుక్కల్‌లో మొదలైన సందడి
Kamareddy: జుక్కల్ మండల కేంద్రంలో కల్వకుంట్ల కవిత సారథ్యంలోని కొత్త పార్టీ పోస్టర్ ఆవిష్కరణ. తెలంగాణ ఆకాంక్షలు, సామాజిక న్యాయమే లక్ష్యంగా పార్టీ ఆవిర్భావం.
Kamareddy: కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ.. జుక్కల్‌లో మొదలైన సందడి
జుక్కల్ (కామారెడ్డి): తెలంగాణ ఆడ బిడ్డ, తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నెల 25 న పెట్టబోయే కొత్త పార్టీ పోస్టర్ ను గురువారం జుక్కల్ మండల కేంద్రంలో కామారెడ్డి జిల్లా జాగృతి అధ్యక్షుడు సంపత్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షుడు మీరే వార్ సాయిలు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ బతుకమ్మ పండుగ ను ప్రపంచానికి గుర్తు చేసి ఒక ఎంపి గా, ఎమ్మెల్సీ గా తన పదవికి వన్నె తెచ్చిన ఘనత కవితక్కది అని అన్నారు. తెలంగాణ ప్రజల్లో నూతన ఒరవడిని తీసుకొచ్చేందుకు హైదరాబాద్ వేదికగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త రాజకీయ పార్టీ కి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు.
పార్టీ దిశ నిర్దేశం, లక్ష్యాలు, ప్రజల అభివృద్ధి, యువతకు రాజకీయ అవకాశాలు కల్పిస్తూ చట్ట సభలో వారి వాణిని వినిపించి సామాజిక న్యాయం సాధించడమే ఈ కొత్త పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై పోరాడుతూ ప్రజల్లో నూతన చైతన్యం తీసుకొచ్చేందుకు గ్రామాల వారిగా కార్యక్రమాలు చేపట్టడం ఈ పార్టీ ప్రధాన ఎజెండా అని అన్నారు. అమరుల ఆశయాల కోసం సంపూర్ణ తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కల సాకారం కోసం ప్రారంభిస్తున్న కొత్త పార్టీ ఏర్పాటు సభకు జుక్కల్ నియోజకవర్గం నుండి యువకులు, మేధావులు, కళాకారులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని హైదరాబాద్ లోని మునీరాబాద్ లో జరిగే కొత్త పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమం లో జుక్కల్ నియోజకవర్గ ఇంచార్జి రాజశేఖర్, మనోహర్, మారుతి, అబ్రార్ తదితరులు పాల్గొన్నారు.




