Banswada: ఎస్ఆర్ఎన్‌కే డిగ్రీ కళాశాలలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం!

Banswada: బాన్సువాడ ఎస్ఆర్ఎన్‌కే కళాశాలలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం, హైదరాబాద్ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహణ. దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ త్యాగాలను స్మరించిన ప్రిన్సిపాల్.

SALEEM, BANSWADA
Published on: 17 Sept 2026 9:52 PM IST
Banswada
X

Banswada: ఎస్ఆర్ఎన్‌కే డిగ్రీ కళాశాలలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం!

ఈరోజు సెప్టెంబర్ 17న ఎస్ ఆర్ ఎన్ కె ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ అటానమస్ కళాశాలలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం కార్యక్రమంలో భాగంగా హైదరాబాదు రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా దొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించిన ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందూర్ గంగాధర్ మాట్లాడుతూ భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించినప్పటికీ హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్రం లభించలేదని చివరి నిజాం రాజు మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ప్రోత్బలంతో ప్రజాకారులు పల్లెలపై పడి ధనమాన ప్రాణాలను హరించినారని రజాకార్లకు వ్యతిరేకంగా దొడ్డి కొమరయ్య తొలి వీర మరణం పొందినాడని చాకలి ఐలమ్మ కొడవళ్ళు, పలుగు, పారలనందుకుని విరోచితంగా పోరాటం సాగించినదని పేర్కొన్నారు.

అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాటం నాలుగు సంవత్సరాల పాటు కొనసాగిందని అదేవిధంగా స్టేట్ కాంగ్రెస్ ఆర్య సమాజం ఆంధ్ర మహాసభల నేతృత్వంలో పోరాటం చేయడంతో గ్రామాల్లో రజాకార్ల ఆగడాలు ఎదుర్కున్నారని ఈ పోరాటంలో 4500 మంది వీర మరణం పొందినారు అని చివరికి నిజాం రాజు హైదరాబాద్ రాష్ట్రాన్ని పాకిస్తాన్లో విలీనం చేయడానికి ప్రయత్నం చేయడంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాదు నిజాంపై పోలీస్ చర్యను ప్రారంభించినాడని.

భారత సైన్యాలకు జనరల్ నాయకత్వం వహించి ఆపరేషన్ పోలో చేపట్టినాడని చివరికి సెప్టెంబర్ 17 1948లో నిజాం రాజు లొంగిపోవడంతో హైదరాబాద్ విమోచనం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఐక్యుఏసి, ఎన్ఎస్ఎస్ ఎన్ సి సి మరియు సోషల్ సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రఫియా యాస్మిన్, పోతరాజు శ్రీనివాస్, బట్టు విటల్, అంబయ్య, బాలరాజు, వినయ్ కుమార్, రాజేష్, గోపాల్, అనిత, పద్మ, మనోహర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA