Nizamabad: తెలంగాణ వర్సిటీ వేడుకల్లో గోరటి వెంకన్న సందడి: "ప్రశ్నించే తత్వమే విద్యార్థికి అసలైన ఆయుధం"

Nizamabad: తెలంగాణ విశ్వవిద్యాలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ, ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని పిలుపు. వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ సమక్షంలో ఘనంగా వేడుకలు.

M. RAMESH,NIZAMABAD
Published on: 23 April 2026 7:35 AM IST
Nizamabad
X

Nizamabad: తెలంగాణ వర్సిటీ వేడుకల్లో గోరటి వెంకన్న సందడి: "ప్రశ్నించే తత్వమే విద్యార్థికి అసలైన ఆయుధం"

డిచ్‌పల్లి (నిజామాబాద్): తెలంగాణ విశ్వవిద్యాలయ వార్షికోత్సవ ఉత్సవాలలో పాలుగోన్నా ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న. Chief Patron విశ్వవిద్యాలయ వీసీ టి. యాదగిరిరావు.. ఈ సందర్భంగా వీ సీ యాదగిరిరావు మాట్లాడుతూ విద్యార్థులదేశించి మాట్లాడుతూ దేశ భవిత, భవిష్యత్తు అభివృద్ధి విద్యార్థుల ఎదుగుదలపై మాత్రమే ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు విద్యతోపాటు పోటీ పరీక్షలు ఎదుర్కొనడంలో కావలసిన సమాచారాన్ని సేకరించి ఒక ప్రణాళిక ప్రకారం కష్టపడి మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకొని మీకు మీ కుటుంబాలకు ఈ దేశానికి గర్వకారణంగా నిలవాలని ఉద్ఘాటించారు. Patron, తెలంగాణ విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ యం. యాదగిరి మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో ఎదురయ్యే సవాళ్లను మనోధైర్యంతో ఎదుర్కొని మీరు ఆశించిన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

విద్యార్థులు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకలింపు చేసుకుని ముందుకు సాగాలని హితవు పలికాడు. ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ప్రజావాగ్గేయకారుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరటి వెంకన్న మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని తెలిపారు. సమాజానికి విద్యార్థులు భూమిక లాంటి వారిని విద్యార్థుల భాగస్వామ్యం లేకుండా చరిత్రలో ఏ ఉద్యమం విజయవంతం కాలేదని పేర్కొన్నారు. విద్యార్థులు తమ తమ కుటుంబ ఆర్థిక స్థితిగతులను తప్పకుండా పరిగణలోకి తీసుకొని ముందుకు సాగాలని పేర్కొంటూ పాశ్చాత్య పోకడలకు దూరంగా ఉండాలని మరీ ముఖ్యంగా మద్యం, మారకద్రవ్యాల మత్తుకు బానిసలు కాకూడదని హితవు పలికారు. తరువాత తనదైన శైలిలో పాటలు పాడి విద్యార్థులను ఉత్తేజపరిచారు.

ఈ కార్యక్రమంలో కల్చరల్ ఆక్టివిటీస్ డైరెక్టర్ ఆచార్య కె. లావణ్య యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి. రాంబాబు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.హెచ్ ఆరతి యూనివర్సిటీ లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. ప్రసన్న రాణి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కన్వీనర్ డాక్టర్ జి బాలకిషన్, వివిధ విభాగాల ఆచార్యులు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story