Armoor: సెప్టెంబర్ 10న 'చలో హైదరాబాద్' మహాధర్నా.. TGEJAC పిలుపు!
Armoor: ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో మహాధర్నా. ఆర్మూర్‌లో TGEJAC నిజామాబాద్ జిల్లా కమిటీ మీడియా సమావేశం.
Armoor: సెప్టెంబర్ 10న 'చలో హైదరాబాద్' మహాధర్నా.. TGEJAC పిలుపు!
Armoor: “చలో హైదరాబాద్ – మహాధర్నా” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ.... TGEJAC రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10 వ తేదీన హైదరాబాద్ నందు నిర్వహించబోయే చలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయుట కొరకు TGEJAC జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు టీఎన్జీవో ఆర్మూర్ యూనిట్ కార్యాలయం నందు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు
ఇట్టి మీడియా సమావేశం నందు TGEJAC రాష్ట్ర చైర్మన్ *శ్రీ మారం జగదీశ్వర్ * , సెక్రటరీ జనరల్ ఏలూర *శ్రీనివాసరావు, ముఖ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, ఈ కింద తెలిపిన ప్రధానమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేనియెడల తదుపరి ఉద్యమ కార్యచరణను ప్రకటిస్తామని తెలిపారు
ప్రధాన డిమాండ్లు
2వ వేతన సవరణ సంఘం (2nd PRC) అమలు చేయాలి
2వ వేతన సవరణ సంఘం నివేదికను వెంటనే తెప్పించి, 01.07.2023 నుండి 51 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను వెంటనే విడుదల చేయాలి
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్‌లో ఉన్న ఆరు కరువు భత్యం (DA) లు ఎటువంటి ఆలస్యం లేకుండా విడుదల చేయాలని కోరారు.
పెండింగ్ బిల్లులన్నింటినీ వెంటనే చెల్లించాలి
ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన సుమారు రూ.10,000 కోట్ల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని, ప్రతి నెల కనీసం రూ.2,000 కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
CPS రద్దు చేసి OPS పునరుద్ధరించాలి
ఉద్యోగుల భవిష్యత్ భద్రతను దృష్టిలో ఉంచుకుని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (OPS)ను పునరుద్ధరించాలని కోరారు.
ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి
ఉద్యోగులు, పెన్షనర్లకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా NEHS/ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ సంఘాల గుర్తింపును పునరుద్ధరించాలి
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో ఉద్యోగ సంఘాల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటూ, ఉద్యోగ సంఘాల గుర్తింపును పునరుద్ధరించి ప్రజాస్వామ్యబద్ధమైన చర్చలకు అవకాశం కల్పించాలని కోరారు.
ఉద్యోగులంతా ఐక్యంగా “చలో హైదరాబాద్”ను విజయవంతం చేయాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు కేవలం వ్యక్తిగత సమస్యలు కాదని, లక్షలాది కుటుంబాలకు సంబంధించిన అంశాలని నాయకులు పేర్కొన్నారు.
ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో నిర్వహించనున్న “చలో హైదరాబాద్ – మహా ధర్నా” కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని TGEJAC పక్షాన కోరారు
ఈ కార్యక్రమంలో TGEJAC రాష్ట్ర నాయకులు దామోదర్ రెడ్డి గారు,B.శ్యామ్ గారు, కటకం రమేష్ గారు, ఎంప్లాయిస్ జేఏసీ నిజాంబాద్ జిల్లా చైర్మన్ టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ గారు, TNGO జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ గారు,టీఎన్జీవో మాజీ జిల్లా కార్యదర్శి కోరిపల్లి సతీష్ రెడ్డి, టిఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, PRTU నిజామాబాద్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ పెంట జలంధర్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మచ్చేందర్,
పెన్షనర్స్ అసోసియేషన్ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, PRTU ఆర్మూర్ మండల అధ్యక్ష కార్యదర్శులు గోపి గంగాధర్, లక్ష్మీనారాయణ, PRTU మండల స్థాయి నాయకులు గోపాల్, గంగాధర్, లక్ష్మణ్, టీఎన్జీవో ఆర్మూర్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు శశికాంత్ రెడ్డి, విశాల్, టీఎన్జీఓ భీమ్గల్ యూనిట్ అధ్యక్షులు సృజన్ కుమార్, టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సభ్యులు మాణిక్యం, సునీల్, రవి, సురేష్, సాయికృష్ణ, భోజేందర్, రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.




