Bodhan: బోధన్‌లో ప్రైవేట్ స్కూళ్ల దందా.. విద్యాశాఖపై TGVP ధర్నా

Bodhan: బోధన్ ప్రైవేట్ స్కూళ్ల బుక్స్ మాఫియాపై హెచ్ఎంటీవీ వెబ్ కథనంతో కలకలం. చర్యలు కోరుతూ తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో భారీ ధర్నా.

K RAVI, BODHAN
Published on: 25 Jun 2026 7:29 PM IST
Bodhan
X

Bodhan: బోధన్‌లో ప్రైవేట్ స్కూళ్ల దందా.. విద్యాశాఖపై TGVP ధర్నా

బోధన్: బోధన్ పట్టణం లో కొనసాగుతున్న పుస్తకాల వ్యాపారం పై hmtv web లో వచ్చిన కథనానికి గురువారం తెలంగాణ విద్యార్థి పరిషత్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రయివేట్ పాఠశాల ల యాజమాన్యాలకు విద్యాశాఖ అధికారులు అండదండలు ఉమ్నాయని వారి పోద్బలంతో ఇష్ట రాజ్యం గా వ్యాపారం కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకులు మీసాల నగేష్ ఆరోపణలు చేశారు.

పేద విద్యార్థుల తల్లి దండ్రుల నుండి అడ్డగోలుగా డబ్బులు దండు కోవడం తో పాటు తమ వద్దనేది పుస్తకాలు కొనుగోలు చేయాలని ఇబ్బందులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులే అండగా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని మండిపడ్డారు. బోధన్ లో పుస్తకాల వ్యాపారాన్ని వెంటనే రద్దు చేసి పేద విద్యార్థుల తల్లి దండ్రులను ఆడుకోవాలన్నారు.

ఈ విషయమై మండల విద్యాది కారి నాగయ్య కు తాము కలిసి సమస్య ను విన్న విస్తే పుస్తకాలవిక్రయాలను అడ్డుకునే అధికారం తమకు లేదని ఇలా అధికారి వ్యవహారం ఉందని పేర్కొన్నారు. తిరిగి జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ను తాము ఫోన్ లో సంప్రదిస్తే సరైన సమాదానం ఇవ్వక పోవడం లో అంతర్యామెంటను ప్రశ్నించారు. వెంటనే పుస్తకాలు విక్రయించే విద్యాసంస్థల పై కఠిన చర్యలు తీసుకోక పోతే పెద్ద ఎత్తున ఆందోళన చెప్పడతామణి హెచ్చరించారు. ఈ నిరసన లో డివిజన్ కార్యదర్శినిఖిల్, వీరేష్, రాజ్ రతన్ విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story