Nizamabad: నవీపేట్‌లో దొంగల బీభత్సం: 20 బోరు బావుల వద్ద కేబుల్ వైర్ల చోరీ!
Nizamabad: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో దొంగల బీభత్సం. 20 బోరు బావుల వద్ద కేబుల్ వైర్ల చోరీ. పేకాట రాయుళ్ల ఆగడాలే కారణమని రైతుల ఆరోపణ.
Nizamabad: నవీపేట్‌లో దొంగల బీభత్సం: 20 బోరు బావుల వద్ద కేబుల్ వైర్ల చోరీ!
నిజామాబాద్ జిల్లా: నవీపేట్ మండలం లోని కోస్లీ లో దొంగలు హల్చల్ చేశారు. వ్యవసాయ బోరు బావుల వద్ద కేబుల్ వైర్లను టార్గెట్ చేస్తూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.
సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు కోస్లీ గ్రామ శివారులో ని సుమారు 20వ్యవసాయ బోరు బావుల వద్ద ప్యానెల్ బాక్స్ లను ధ్వంసం చేసి కేబుల్ వైర్లను దొంగిలించారు.
దుండగులు ప్యానల్ బోర్డు లను సైతం ఎత్తుకెళ్లడం తో రైతులు తీవ్ర ఆందోళన కు గురువుతున్నారు. సుమారు రూ. 3లక్షల కు పైగా నష్టం వాటిల్లినట్లు రైతులు పేరొంటుంన్నారు.
పేకాట్రాయుళ్ల పనే: నవీపేట్ మండలం లోని కోస్లీ తో పాటు ఫకిరాబాద్ తదితర ప్రాంతాల్లో పేకాట రాయుళ్ల ఆగడలు అధికమవ్వడం తో చోరీలు జరుగుతునయని రైతులు ఆరోపిస్తున్నారు.
పోలీసులు పేకాటను నివారించినట్లయితే దొంగతనాలు జరగవని పలువురు అభిప్రాయ పడుతున్నారు. పేకాట నిర్వాహకులకు పోలుసుల అండ దండలు పుష్కలం గా ఉండడడం తో ఇలాంటి ఘటనలు పునరావృతమౌతునాయని మండల ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.




