Bichkunda: బిచ్కుందలో వృద్ధురాలి ఇంట్లో చోరీ.. ముగ్గురు అరెస్ట్

Bichkunda: బిచ్కుందలో ఒంటరి వృద్ధురాలి ఇంట్లో చోరీకి పాల్పడిన ముగ్గురు పాత నేరస్థులను పోలీసులు అరెస్టు చేసి రూ.12 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

VEERANNA, JUKKAL
Published on: 24 Oct 2026 8:20 PM IST
Bichkunda
X

Bichkunda: బిచ్కుందలో వృద్ధురాలి ఇంట్లో చోరీ.. ముగ్గురు అరెస్ట్

బిచ్కుంద (కామారెడ్డి): బిచ్కుంద పట్టణంలోని ఓ వృద్దురాలి ఇంట్లో గత వారం రోజుల క్రితం ఇంట్లో ఎవరు లేని సమయంలో చోరికి పాల్పడి 15 వేల నగదు ను అపహారించిన ముగ్గురు నిందుంతులను అరెస్ట్ చేసినట్లు బిచ్కుంద ఎస్సై గుండెల రాజు తెలిపారు. పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం బిచ్కుంద పట్టణంలో ఒంటరిగా ఉండే సుంకరి సాయవ్వ ఈ నేల 14 న తమ బంధువుల ఇంట జరిగే విందుకోసం ఇంటికి తాళం వేసి వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు 18 న ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి తలుపులు పగులగొట్టి 15 వేల రూపాయల నగదు ను అపహారించుకుపోయారు.

బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీస్ లు సి సి కెమెరా పుటేజ్, స్థానికుల సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు లో భాగంగా బిచ్కుంద పోలీస్ లు చాక చక్యంగా వ్యవహరించి శనివారం రాజుల్ల చౌరస్తా లో ముగ్గుర్ని అదుపులోకి తీసుకొని విచారించగ నేరం అంగీకరించారు. నేరం అంగీకరించిన వారిలో బాన్స్ వాడ కు చెందిన దాసరి తిరుపతి, బిచ్కుంద పట్టణానికి చెందిన చౌహన్ అర్జున్, చౌహన్ సురేష్ లను విచారించగ చోరికి పాల్పడింది తామే నంటూ నేరం అంగీకరించడం తో నిందితుల నుండి 12 వేల నగదు, నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్ ను స్వాధీనం చేసుకున్నారు.

మద్యానికి బనిసై డబ్బల కోసం చోరికి పాల్పడిన ముగ్గురిలో బాన్స్ వాడ కు చెందిన తిరుపతి పై ఇదివరకే 10 చోరీ కేసులు ఉండగా, బిచ్కుంద కు చెందిన చౌహన్ అర్జున్ పై 5 చోరీ కేసులు ఉన్నట్లు ఎస్సై వెల్లడించారు. చోరీ కేసును త్వరతగతిన చెందించిన బిచ్కుంద సి ఐ రవికుమార్, ఎస్సై జి. రాజు, పోలీస్ లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL