Bodhan: పొలాల్లో నాటు బాంబులు పెట్టి వేట.. బోధన్‌లో ముగ్గురు నిందితుల అరెస్ట్!

Bodhan: బోధన్ మండలం పెంట ఖుర్డ్ శివారులో నాటు బాంబులతో అడవి పందులను వేటాడుతున్న ముగ్గురిని రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు.

K RAVI, BODHAN
Published on: 6 Sept 2026 9:12 PM IST
Bodhan
X

Bodhan: పొలాల్లో నాటు బాంబులు పెట్టి వేట.. బోధన్‌లో ముగ్గురు నిందితుల అరెస్ట్!

బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెంట ఖుర్డ్ శివారులో అడవి పందుల వేటగాళ్ల ను అదుపులో కి తీసుకొని రూరల్ ఎస్ ఐ రాజశేఖర్ కేసు నమోదు చేశారు. బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు తెలిపిన వివరాల ప్రకారం. పంట పొలాల్లో నాటు బాం బులను అమర్చి వన్యప్రాణుల ను, అటవి జంతువులను వేటాడుతున్నట్లు పక్కపలువురిని అదుపులోకి తీసుకునట్లు సీ ఐ వివరించారు.

పక్క సమాచారం రావడం తో బోధన్ పట్టణంలో రాకాసి పేటకు చెందిన మైసయ్య, దత్తు, గంగాధర్ లను రూరల్ ఎస్సై రాజశేఖర్ పగడ్బందీగా నిఘా ఏర్పాటు చేసి పట్టుకున్నరని సిఐ వెల్లడించారు. నాటు బాంబులవల్ల ప్రజలకు రైతులకు తీవ్ర ప్రాణ నష్టం వాటిలో ప్రమాదం ఉందని అందుకోసం వేటగాళ్ళు అదుపులోకి తీసుకొని వారి వద్దనున్న నాటు బాంబులు స్వాధీన పరుచుకొని బోధన్ ఎసిపి శ్రీనివాస్ ఆదేశానుసారం కేసు నమోదు చేసినట్లు సిఐ వెల్లడించారు. అటవీ జంతువులు వన్య ప్రాణులను వేటాడితే చట్టరీత చర్య తప్పవని సిఐ హెచ్చరించారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN