Makloor: ఆ ఊరి 9 ఏళ్ల కల సాకారం.. ఎట్టకేలకు గ్రామానికి చేరిన ఆర్టీసీ బస్సు!

Makloor: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం చిన్నాపూర్ గ్రామానికి సుమారు 9 సంవత్సరాల తర్వాత ఆర్టీసీ బస్సు సర్వీస్ పునఃప్రారంభమైంది.

VAMSHI, ARMOOR
Updated on: 17 Jun 2026 9:15 PM IST
Makloor
X

Makloor: ఆ ఊరి 9 ఏళ్ల కల సాకారం.. ఎట్టకేలకు గ్రామానికి చేరిన ఆర్టీసీ బస్సు!

ఆర్మూర్: జిల్లా కేంద్ర మాక్లూర్ మండల్ చిన్నపూర్ గ్రామానికి బస్సు లేనందున నిజామాబాద్ బస్ డిపో మేనేజర్ కి ఇటీవల వినతి పత్రం అందజేసిన గ్రామ సర్పంచ్.

గ్రామానికి బస్సు ఎప్పటినుంచి రావడం లేదు:

చిన్నాపూర్ గ్రామానికి ఆర్టీసీ బస్సు రకా సుమారు 9 సంవత్సరాల నుంచి గ్రామ ప్రజలకు ఇబ్బందికరంగా ఉండేది, గ్రామ ప్రజల యొక్క కల 9 సంవత్సరాలకు నెరవేరింది, గ్రామానికి ఈరోజు బస్సు రావడంతో ప్రజలంతా ఆశ్చర్యపడ్డారు, మా ఊరికి బస్సు వచ్చిందా ఈరోజు అంటూ ఆనందపడుతూ, గ్రామ ప్రజలంతా కలిసి గ్రామ సర్పంచ్, డిపో మేనేజర్ కి ధన్యవాదాలు తెలిపారు.

గ్రామ సర్పంచ్ యొక్క వివరణ:

ఇటీవల గ్రామ సర్పంచ్ డిపో మేనేజర్ కి వినతి పత్రం అందజేయడంతో, స్పందించిన మేనేజర్ కి గ్రామ సర్పంచ్ ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు బస్సు గ్రామానికి రాగానే బస్సుకు కొబ్బరి మట్టల ను కట్టి, సర్పంచ్ చేతిలో మీదగా బస్సు కు కొబ్బరికాయ కొట్టి బస్సును ప్రారంభించారు,

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మన ఊరుకు బస్సు రావడం తో మన కల నెరవేరింది, నేను సర్పంచ్ గా ఉన్న టైంలో బస్సు మన ఊరికి రావడం, ఆ బస్సు కు కొబ్బరికాయ కొట్టడం అంతా నా అదృష్టమంటూ గ్రామ ప్రజలకు తెలుపుతూ, ఎందుకంటే బస్సు రాక మన గ్రామానికి సుమారు తొమ్మిది సంవత్సరాలయింది, అది మన గ్రామ ప్రజలకు అందరూ తెలిసిన విషయమే, ఇక బస్సు మన గ్రామానికి రావడం మొదలైంది, రోజుకు 7 టిప్స్ నిజాంబాద్ నుంచి ఆలూరు, దేగాం వరకు రోజు మన ఊరు పైనుంచి వెళ్తుంది, కావున గ్రామ ప్రజలు ఈ ఒక బస్సుని సమయం బట్టి వినియోగించుకోవాలని సర్పంచ్ కోరుతున్నారు గ్రామ ప్రజలకు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story