Nizamabad: టీయూ అధ్యాపకులపై విషప్రచారం.. ఆగ్రహం వ్యక్తం చేసిన TUTA!
Nizamabad: తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2014లో నియమితులైన అధ్యాపకులపై తప్పుడు ఆరోపణలను ఖండించిన టీచర్స్ అసోసియేషన్ (TUTA).
Nizamabad: టీయూ అధ్యాపకులపై విషప్రచారం.. ఆగ్రహం వ్యక్తం చేసిన TUTA!
Nizamabad: తెలంగాణ విశ్వవిద్యాలయం 2012 నోటిఫికేషన్ ద్వారా 2014లో నియమితులైన అధ్యాపకులపై ఇటీవల కొందరు వ్యక్తులు చేసిన ఆరోపణలు పూర్తిగా ఏకపక్షమైనవి, వాస్తవాలను దాచిపెట్టేవి, న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న అంశాన్ని ప్రజా వేదికలపై తప్పుగా చిత్రీకరించేవిగా ఉన్నాయని భావిస్తూ దానిని తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (TUTA) తీవ్రంగా ఖండించింది.
హైకోర్టులో అప్పీళ్లు పెండింగ్‌లో ఉండగా సింగిల్ జడ్జి తీర్పును అంతిమ తీర్పుగా ప్రచారం చేయడం చట్టవిరుద్ధం, W.P.No.5566 of 2013లో సింగిల్ జడ్జి గారి ఉత్తర్వు తేదీ 31.10.2025పై ఇప్పటికే తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు W.A.Nos.1316, 1324, 1325 of 2025, W.A.No.29 of 2026 సహా రిట్ అప్పీల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఉత్తర్వుపై ఇంటీరిమ్ సస్పెన్షన్ మంజూరు చేసింది.
అందువల్ల ఆ సింగిల్ జడ్జి ఉత్తర్వును అమలులో ఉన్న తుది తీర్పుగా చూపిస్తూ, అధ్యాపకులను “అక్రమ నియామకులు”గా ముద్ర వేయడం చట్టపరంగా తప్పు, నైతికంగా అన్యాయమని అసోసియేషన్ తెలిపింది.సుప్రీంకోర్టు హై కోర్ట్ బార్ అసోసియేషన్ , అలాహాబాద్ v. State of U.P., 2024 INSC 150 కేసులో స్పష్టంగా పేర్కొన్నది. హైకోర్టు ఇచ్చిన ఇంటీరిమ్ స్టే / ఇంటీరిమ్ రిలీఫ్ స్వయంగా కాలపరిమితి ముగిసిందని భావించి రద్దు అయినట్లు చెప్పలేరు.
అలాంటి ఉత్తర్వు రద్దు కావాలంటే, దానిని రద్దు చేసే స్పష్టమైన న్యాయ ఉత్తర్వు ఉండాలి లేదా ప్రధాన కేసు పరిష్కారమవాలి. కాబట్టి “స్టే గడువు ముగిసింది” అనే ప్రచారం చట్టపరంగా నిలబడదని గమనించాలన్నారు.అలాగే, నియామక ప్రక్రియలో పాల్గొని, ఫలితం అనుకూలంగా రాకపోయిన తరువాత అదే నియామక ప్రక్రియను సవాలు చేయరాదనే న్యాయ సూత్రాన్ని గౌరవ సుప్రీంకోర్టు Madan Lal v. State of J&K, Ashok Kumar v. State of Bihar, Manish Kumar Shahi, Ramesh Chandra Shah వంటి అనేక తీర్పుల్లో స్థిరపరిచింది.
ఈ కీలక న్యాయ అంశాలు ప్రస్తుతం డివిజన్ బెంచ్ ముందు పరిశీలనలో ఉన్నాయి. కాబట్టి కేసు తుది నిర్ణయం రాకముందే ఒక పక్షం తమ అభిప్రాయాన్ని తుది న్యాయస్థితిగా ప్రచారం చేయడం తీవ్ర అభ్యంతరకరమైనదని అసోసియేషన్ భావిస్తుంది.తెలంగాణ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు గౌరవప్రదంగా బోధన బోధనేతర, పరిశోధన విధులు నిర్వహిస్తున్నారని వారు చాలా సంవత్సరాలుగా విశ్వవిద్యాలయానికి, విద్యార్థులకు పరిశోధకులకు సేవలందిస్తున్నారు.
కోర్టు తుది నిర్ణయం ఇవ్వకముందే ఉద్యోగ భద్రత గౌరవాన్ని దెబ్బతీయడం క్షమించరాని చర్యగా అసోసియేషన్ భావిస్తుందన్నారు.తెలంగాణ విశ్వవిద్యాలయ అధికారులు, ప్రభుత్వం, హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు పెండింగ్‌లో ఉన్న రిట్ అప్పీల్స్ తుది నిర్ణయం వచ్చే వరకు చట్ట ప్రకారం మాత్రమే వ్యవహరించాలన్నారు.పదోన్నతులకు కోర్టు కేసుకు సంబంధం లేదన్నారు.తెలంగాణ యూనివర్సిటీలో 2014లో నియామకం పొందిన అధ్యాపకులు అందరికీ పదోన్నతి కల్పించాలని ప్రభుత్వం లేఖ నంబర్ 1433/యూ ఈ / ఏ 2 2013 తేదీ 11-11-2024 ద్వారా తెలిపింది.
పదోన్నతుల ప్రక్రియను కొనసాగించాలని అడ్వకేట్ జనరల్ తన లీగల్ ఒపీనియన్ లో పేర్కొన్నారని , 2025 జనవరి 4న జరిగిన ఈసీ పదోన్నతి ప్రక్రియను పూర్తి చేయాలని తీర్మానించిందన్నారు. ఈ క్రమంలో హైకోర్టుసింగిల్ బెంచ్ వన్ టూ నోటిఫికేషన్ లను సెట్ ఎసైడ్ చేయాలని 31 అక్టోబర్2025 తీర్పునిచ్చింది. ఆ తీర్పును సవాలు చేస్తూ విశ్వవిద్యాలయ అధికారులతో పాటు నియామకపు పొందిన అధ్యాపకులందరూ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించినారు.
26 నవంబర్ 2025న డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేస్తూ ప్రతివాదులకు అభ్యంతరాలు ఉంటే నాలుగు వారాలలో అప్పీల్ చేసుకోవాలని కోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినారు. అందువల్ల అధ్యాపకులు అందరూ న్యాయస్థానాలపై పూర్తి విశ్వాసం కలిగి ఉన్నారు. ఈ విషయం కోర్టులో పరిష్కరించబడాలని , కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాలను వక్రీకరించే ఆరోపణలు చేస్తే, సంబంధితులపై డిఫమేషన్, కాంటెంప్ట్ ఇతర చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అసోసియేషన్ వెనుకాడదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎ పున్నయ్య, ప్రధాన కార్యదర్శి ఎన్.మోహన్ బాబు, ఉపాధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ బాలకిషన్, డాక్టర్ నీలిమ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు డాక్టర్ జమీల్ అహ్మద్, డాక్టర్ ప్రసన్న రాణి, ప్రొఫెసర్ విద్యావర్ధిని, డా. వాసం చంద్రశేఖర్, డా. అంజయ్య, డా. ధరావత్ నాగరాజు, డా. సబితా డా. హరిత డాక్టర్ లక్షణ చక్రవర్తి, డాక్టర్ రమణాచారి, డాక్టర్ ప్రసన్న శీల, తదితరులు పాల్గొన్నారు.




