Nizamabad: జాకోర వద్ద నిజాంసాగర్ కెనాల్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం!
Nizamabad: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోర వద్ద నిజాంసాగర్ కెనాల్‌లో గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైంది.
Nizamabad: జాకోర వద్ద నిజాంసాగర్ కెనాల్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం!
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరా గ్రామం వద్ద నిజాం సాగర్ ప్రధాన కాలువలో ఒక గుర్తు తెలియని మృత దేహం దొరికిందని,వర్ని ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. ఈరోజు ఉదయం జాకోర వద్ద గల నిజాంసాగర్ కెనాల్‌లో గుర్తుతెలియని ఒక పురుషుడి (ముస్లిం )మృతదేహం కొట్టుకొని రావాదం జరిగిందని,
మృతుడి వయస్సు సుమారు 60 నుండి 65 సంవత్సరాల మధ్య ఉండవచ్చని అంచనా. మృతుడికి గడ్డం ఉంది. ఒంటిపై ఆరెంజ్ కలర్ దుస్తులు ధరించి ఉన్నాడనీ పోలీసులు తెలిపారు. సదరు వ్యక్తి గురించి ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే లేదా మృతుడి ఆచూకీకి సంబంధించిన వివరాలు తెలిసినట్లయితే, వెంటనే వర్ని పోలీస్ స్టేషన్కు లేదా SI, వర్ని పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని తెలిపారు.
వర్ని పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్లు 8712659786, SI, వర్ని: 8712659877




