Bodhan: అంగన్వాడీల వినూత్న నిరసన.. గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం!

Bodhan: నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు వినూత్నంగా నిరసన తెలిపారు.

K RAVI, BODHAN
Published on: 16 Jun 2026 7:07 PM IST
Bodhan
X

Bodhan: అంగన్వాడీల వినూత్న నిరసన.. గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం!

Bodhan: రాష్ట్రాప్రభుత్వం పీఎం శ్రీ, ప్రైమరి పథకాన్నివెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వర్ని మండలకేంద్రం లో గాంధీ విగ్రహం కు వినతి పత్రం అందజేశారు. మంగళవారం వర్ని మండల కేంద్రం లో అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యకం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం 4131 కేంద్రాలనును రద్దు చేస్తూ అంగన్వాడీ కేంద్రాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం లో సుమారు 70వేల మంది అంగన్వాడీ టీచర్లు, ఆయలు చేయాలన్నారు. విద్యా చట్టాన్ని అంగన్వాడీ లకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 24 రోజుల సమ్మెలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఎన్నికల ముందు అంగన్వాడీలు, ఆయలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ఇచ్చిన జిఓ ను అమలు చేయాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఎన్ఈ పీ 2020 చట్టాన్ని వ్యతిరకి స్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమం లో ఉమ్మడి వర్ని మండలం అధ్యక్షురాలు చంటి, సిబ్బంది శ్రీదేవి, అనురాధ, స్వరూప, శ్రీలత, వివిధ గ్రామాల టీచర్లు ఉన్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story