Armoor: భీమవరం నుంచి ఢిల్లీ వరకు 'నషా ముక్త్ భారత్' సైకిల్ యాత్ర!
Armoor: భీమవరం నుంచి ఢిల్లీ వరకు 'నషా ముక్త్ భారత్' సైకిల్ యాత్ర చేస్తున్న డాక్టర్ ఇందుకూరి విజయలక్ష్మి ఆర్మూర్‌లో డ్రగ్స్‌పై అవగాహన కల్పించగా, వీహెచ్‌పీ ఆధ్వర్యంలో సన్మానించారు.
Armoor: భీమవరం నుంచి ఢిల్లీ వరకు 'నషా ముక్త్ భారత్' సైకిల్ యాత్ర!
Armoor: విశ్వ హిందూ పరిషత్ ఇందూర్ జిల్లా ఆర్మూర్ నగరం ఆధ్వర్యంలో 'నాషా ముక్త్ భారత్ ' భీమవరం నుండి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేస్తునటువంటి డాక్టర్ ఇందుకూరి విజయలక్ష్మి సైకిల్ యాత్ర లో భాగంగా ఆర్మూర్ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల లో నష ముక్త్ భారత్ కార్యక్రమం నిర్వహించి డ్రగ్స్,మారక ద్రవ్యల మీద అవగాహన కల్పించడం జరిగింది.
వారికీ విశ్వ హిందూ పరిషత్ ఆర్ముర్ నగరం ఆధ్వర్యంలో సన్మానం చేసి వారి యాత్ర విజయవంతం కావాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమం నగర సంఘ చాలక్ పోల్కం నారాయణ , జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, జిల్లా విశేష సంపర్క ప్రముఖ్ అల్జపూర్ అక్షయ్ , నగర ఉపాధ్యక్షులు గంజాల ప్రేమ్ , సురక్ష ప్రముఖ్ ప్రవీణ్ , సత్సంగ్ ప్రముఖ్ యోగేష్ , బలోపాసన ప్రముఖ్ సాయి , బజరంగ్ రిషి మరియు బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.




