Nizamabad: గాంధీని దైవంగా భావించి పూజలు చేసే నిజామాబాద్ జిల్లా గ్రామం!

Nizamabad: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం నర్సింగ్‌పూర్ గ్రామంలో ఏ శుభకార్యమైనా తొలి దైవంగా మహాత్మా గాంధీకి పూజలు చేసే వినూత్న ఆచారం కొనసాగుతోంది.

M. RAMESH,NIZAMABAD
Published on: 2 Oct 2026 10:59 AM IST
Nizamabad
X

Nizamabad: గాంధీని దైవంగా భావించి పూజలు చేసే నిజామాబాద్ జిల్లా గ్రామం!

Nizamabad: గాంధీ జయంతి అనగానే గాంధీ విగ్రహానికి నివాళ్ల అర్పిస్తారు కానీ ఆ ఊర్లో గాంధీ ని దైవంగా భవిస్తూ నిత్యం పూజలు చేస్తూ దేశ భక్తి చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల నర్సింగ్ పూర్ గ్రామస్తులు అనాధిగా వస్తున్న ఆచారాన్ని ఫాలో అవుతున్నారు.ఉళ్లో ఏ శుభకార్యం జరిగినా తొలి దైవంగా మహాత్మా గాంధీని క పూజించడం ఆనవాయితీగా వస్తుంది. మొదటగా గాంధీజీ విగ్రహానికి పూల మాల వేసి కొబ్బరికాయ కొట్టాల్సిందే.

అక్కడా లేని విధంగా గాంధీజీని దైవంగా భావిస్తున్నారు నర్సింగ్ పూర్ గ్రామస్థులు. ఊళ్లో పెళ్లిళ్లైనా పేరంటాళ్లైనా ఏ పండగైనా ఫస్ట్ గాంధీజీకి పూజలు చేస్తామని గ్రామస్థులు పేర్కొన్నారు చూసేవారికి కాస్త ఆశ్చర్యం కలిగినా... నర్సింగ్ పూర్ గ్రామస్థులు అనాధిగా వస్తున్న ఆచారాన్ని మాత్రం తూచాతప్పకుండా పాటిస్తున్నారు. దేశవ్యాప్తంగా గాంధీ జయంతి రోజు మహాత్మున్ని అందరూ స్మరించుకుంటారు. కానీ ఈ గ్రామస్థులు మాత్రం నిత్యం ఈ మహాత్మునికి పూజలు నిర్వహించుకుంటున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు పోరాడిన గాంధీజీని నర్సింగ్ పూర్ గ్రామస్థులు దైవంతో సమానంగా ఆరాధిస్తారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD