Nizamabad: వీఆర్ఏ వారసులకు న్యాయం చేయాలి: మంత్రి సీతక్కకు వినతి
Nizamabad: జీవో నెం. 81, 85 ప్రకారం అర్హులైన వీఆర్ఎ వారసులకు వెంటనే నియామక ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ మంత్రి సీతక్కకు వీఆర్ఎలు వినతిపత్రం అందజేశారు.
Nizamabad: వీఆర్ఏ వారసులకు న్యాయం చేయాలి: మంత్రి సీతక్కకు వినతి
Nizamabad: జీవో నెం. 81, 85 ప్రకారం అర్హులైన వీఆర్ఎ వారసులకు వెంటనే నియామక ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలానికి చెందిన వీఆర్ఎ వారసులు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) కు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ., జీవో నెం.81, 85 ప్రకారం నియామక ప్రక్రియ ప్రారంభమై 35 నెలలు గడిచినా ఇప్పటికీ నియామక ఉత్తర్వులు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 61 సంవత్సరాలు పూర్తిచేసుకున్న వీఆర్ఎల వారసుల్లో మిగిలి ఉన్న 3,797 మందికి, అలాగే ఇందల్వాయి మండలానికి చెందిన అర్హులైన వీఆర్ఎ వారసులకు వెంటనే నియామక ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని మంత్రికి విన్నవించారు. దీనిపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందిస్తూ, సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఎలు బైరి రాము, బాలనారాయణ, బాలు, బాల గంగారం, కిషన్, సుధాకర్, గంగాధర్, హబీబ్తో పాటు పలువురు నార్త్ మండల వీఆర్ఎలు పాల్గొన్నారు.




