Nizamabad: నిజామాబాద్ జిల్లాలో వన్యప్రాణి సంరక్షణ అవగాహన బైక్ ర్యాలీ!

Nizamabad: వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహణ.

M. RAMESH,NIZAMABAD
Published on: 5 Oct 2026 11:30 AM IST
Nizamabad
X

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో వన్యప్రాణి సంరక్షణ అవగాహన బైక్ ర్యాలీ!

Nizamabad: వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవి మోహన్ బట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో రేంజ్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు.

వన్యప్రాణులను వేటాడడం, హింసించడం అక్రమంగా వేటాడటం వంటి చర్యలకు పాల్పడకుండా ప్రజలు సహకరించాలని కోరారు. అడవులు, వన్యప్రాణులను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు వివరించారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవి మోహన్ బట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD