Nandipet: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్!
Nandipet: నందిపేట్ మండలం మాయాపూర్ గ్రామంలో మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ. ఇచ్చిన మాట ప్రకారం భవనాన్ని నిర్మిస్తున్న సర్పంచ్ బ్యాగరి జీవన్.
Nandipet: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్!
నందిపేటీ: జిల్లా కేంద్ర నందిపేట్ మండల్ మాయాపూర్ గ్రామంలో మహిళా సంఘం భవనం భూమి పూజ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, సంఘ మహిళల, అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించబడినది.
గ్రామ సర్పంచ్ జీవన్:
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, మొదటగా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదములు, ఇటీవలే జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ గారు నేను పోటీ చేసినందుకు, నాపై నమ్మి గ్రామ ప్రజలు నన్ను గ్రామానికి సర్పంచ్ గెలిపించారు ఓట్లతో, ఆ ఎన్నికలో నేను గ్రామానికి మహిళా సంఘం లేనందున, నన్ను గెలిపియండ్రి నేను గెలిచిన తర్వాత గ్రామానికి మహిళా సంఘం తీసుకొస్తానని ఆ సమయంలో హామీ ఇవ్వడం జరిగింది, ఇచ్చిన మాట అందునా మన గ్రామానికి నిధులు తెప్పించి, అ నిధులతో ఈరోజు మహిళా సంఘానికి భూమి పూజ చేసి, కొబ్బరికాయ కొట్టి నా చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది, నాకు ఇది చాలా సంతోషంగా ఉంది అంటూ మాట్లాడాడు.
ఈ కార్యక్రమంలో గౌరవ సర్పంచ్ బ్యాగరి జీవన్, ఉప సర్పంచ్ కడారి విష్ణు, కార్యదర్శి వెంకటేష్, ఐకేపీ వెంకటేష్ జీపీ పాలకవర్గం వార్డ్ సభ్యులు గంగాధర్, వినోద్, మల్లేష్ గ్రామ వీడిసి సభ్యులు ముత్తన్న, వివో స్రవంతి మహిళా సంఘం సభ్యులు ,వివిధ పార్టీ నాయకులు గొల్ల కిష్టన్న, గంగ మల్లు నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




