Nizamabad: బడిలో పురుగుల అన్నం, నీళ్ల పప్పుచారు.. తనిఖీల్లో సత్యాలు!

Nizamabad: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడం తీవ్ర కలకలం రేపింది.

SALEEM, BANSWADA
Updated on: 18 July 2026 12:23 AM IST
Nizamabad
X

Nizamabad: బడిలో పురుగుల అన్నం, నీళ్ల పప్పుచారు.. తనిఖీల్లో సత్యాలు!

నిజామాబాదు: రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వహకుల నిర్లక్ష్యం వలన విద్యార్థులకు నాణ్యత లేని భోజనం అందిస్తున్నారు.

శుక్రవారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, ఉప సర్పంచ్ నిస్సార్, ఎంపిడిఓ బాల గంగాధర్, ఎంపిఓ అరవింద్, గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రేమ్ దాస్ లతో కలిసి ఆమె సందర్శించారు. విద్యార్థులకు అందించే

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. బియ్యం బస్తాలలో, వండిన మధ్యాహ్న భోజనంలో పురుగులు కనిపించడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. వంటకు వినియోగించిన బియ్యం కూడా పురుగులమయంగా ఉన్నాయి. దీంతో మధ్యాహ్న భోజనం నాణ్యత పై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

పాఠశాలలో విద్యార్థులకు నాణ్యత లేని భోజనం పెడుతున్నారని, వారానికి మూడు సార్లు గుడ్లు పెట్టాల్సి ఉండగా, గుడ్లు కూడా పెట్టాడం లేదని, నీళ్లతో కూడిన పప్పుచారు పోస్తున్నారని విద్యార్థులు గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకొచ్చారు.

మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని విద్యార్థుల తల్లి దండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లి దండ్రులు కోరారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story