Markapuram: 11 వైసీపీ ఎంపీటీసీ నామినేషన్ల తిరస్కరణ.. ఆర్వోపై ఆరోపణలు!

Markapuram: మార్కాపురం జిల్లా సీఎస్‌పురంలో 11 వైసీపీ ఎంపీటీసీ నామినేషన్లు తిరస్కరణ. ఆర్వో, పోలీసుల తీరుపై వైఎస్సార్‌సీపీ నేతలు, మాజీ జడ్పీటీసీ శ్రీనివాసులు మండిపాటు.

Guravayya, Kanigiri
Published on: 24 Oct 2026 8:24 PM IST
Markapuram
X

Markapuram: 11 వైసీపీ ఎంపీటీసీ నామినేషన్ల తిరస్కరణ.. ఆర్వోపై ఆరోపణలు!

మార్కాపురం జిల్లా: సీఎస్‌పురం మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన సందర్భంగా వివాదం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీకి చెందిన 11 ఎంపీటీసీ నామినేషన్లను తిరస్కరించడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించినప్పటికీ, కావాలనే నామినేషన్లను తిరస్కరించారని ఆరోపించారు.

నామినేషన్ల పరిశీలనలో రిటర్నింగ్ అధికారి (ఆర్వో) ఏకపక్షంగా వ్యవహరించారని వైసీపీ నేతలు విమర్శించారు. టీడీపీ నేతల నామినేషన్ పత్రాలను పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే ఆమోదించారని ఆరోపించారు.

నామినేషన్ల తిరస్కరణపై నిబంధనల గురించి ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ ఎంపీపీ అభ్యర్థి వరుణ్ కుమార్‌ను టీడీపీ నేతలు బెదిరించారని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. పోలీసుల సమక్షంలోనే నామినేషన్ పత్రాలను చించివేసినా అధికారులు పట్టించుకోలేదని వరుణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు.

మరోవైపు, పోలీసులు అధికార కూటమి పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మాజీ జడ్పీటీసీ మేకల శ్రీనివాసులు యాదవ్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. 11 ఎంపీటీసీ నామినేషన్ల తిరస్కరణ వ్యవహారం సీఎస్‌పురంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Guravayya, Kanigiri

Guravayya, Kanigiri