Markapuram: పెద్దారవీడు మండలానికి 27 అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు!
Markapuram: పెద్దారవీడు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు 27 అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు మంజూరయ్యాయి.
Markapuram: పెద్దారవీడు మండలానికి 27 అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు!
Markapuram: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను నివారించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పెద్దారవీడు మండలానికి 27 అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు మంజూరయ్యాయి. ఇందులో 10 స్కూల్ అసిస్టెంట్ స్థాయి, 17 సెకండరీ గ్రేడ్ స్థాయి పోస్టులు ఉన్నాయి.
స్కూల్ అసిస్టెంట్ స్థాయి వారికి నెలకు రూ.12,500, సెకండరీ గ్రేడ్ స్థాయి వారికి రూ.10,000 చొప్పున ఎనిమిది నెలల కాలానికి గౌరవ వేతనం చెల్లించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారులు పి. శ్రీనివాసులు, ఎస్‌వీసీహెచ్ సుబ్రహ్మణ్యం తెలిపారు.
మండలంలోని వివిధ జడ్పీ, ఎంపీపీ, ఎంపీయూపీ పాఠశాలలకు ఈ పోస్టులను కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 21వ తేదీలోపు అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను పెద్దారవీడు ఎంఆర్‌సీ కార్యాలయంలో అందజేయాలని అధికారులు సూచించారు.




