Tripurantakam: త్రిపురాంతకం గణపవరంలో 5 అడుగుల నాగుపాము పట్టివేత
Tripurantakam: గణపవరం గ్రామంలోని ఓ ఇంట్లోకి 5 అడుగుల నాగుపాము ప్రవేశించడంతో భయాందోళన. స్నేక్ క్యాచర్ మల్లికార్జున చాకచక్యంగా పట్టుకుని అడవిలో వదిలిపెట్టారు.
Tripurantakam: త్రిపురాంతకం గణపవరంలో 5 అడుగుల నాగుపాము పట్టివేత
త్రిపురాంతకం: మార్కాపురం జిల్లా....!!! త్రిపురాంతకం మండలం గణపవరం గ్రామానికి చెందిన నక్క గురవయ్య ఇంట్లో సుమారు 5 అడుగుల పొడవున్న నాగుపాము కనిపించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ మల్లికార్జున వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అత్యంత చాకచక్యంగా నాగుపామును సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం పామును జనావాసాలకు దూరంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
సమయానికి స్నేక్ క్యాచర్ మల్లికార్జున స్పందించి పామును పట్టుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. పామును ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా పట్టుకోవడంతో గ్రామస్తులు మల్లికార్జునను అభినందించారు.
ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పాములు కనిపించినప్పుడు వాటిని చంపేందుకు ప్రయత్నించకుండా వెంటనే స్నేక్ రెస్క్యూ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని మల్లికార్జున సూచించారు.




