Prakasam: రైతులకు అద్దంకి ఏఓ కీలక సూచన.. ఆ పంట వేస్తే భూమి బంగారం!
Prakasam: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చినకొత్తపల్లిలో ప్రకృతి వ్యవసాయ శిక్షణ.
Prakasam: రైతులకు అద్దంకి ఏఓ కీలక సూచన.. ఆ పంట వేస్తే భూమి బంగారం!
Prakasam: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం రసాయనిక ఎరువుల వాడకం తగ్గించడమే ప్రధాన లక్ష్యం గా పనిచేయాలని గ్రామ వ్యవసాయ సహాయకులు కు మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి అద్దంకి మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ సూచించారు. చినకొత్తపల్లి గ్రామం లో రైతు సేవా కేంద్రం వద్ద నిర్వహించిన రెండవ రోజు శిక్షణా కార్యక్రమం లో భాగం గా మండల వ్యవసాయాధికారి మాట్లాడుతూ రానున్న రెండు నెలలో ఎల్నినో ప్రభావం వలన ఎండ తీవ్రంగా ఉంటుందని దాని ప్రభావం తగ్గించడానికి నవ ధాన్యాలు సాగు చేసి భూమిని గ్రీన్ కవర్ లా చేయాలని సూచించారు. 40 నుండి 45 రోజుల తరువాత వీటిని కలిసి దున్నినప్పుడు భూమి సారవంతం అవుతుందన్నారు కార్యక్రమం లో టెక్నికల్ పర్సన్ అశోక్ కుమార్ మాట్లాడుతూ 10 కేజీ ల పి ఎం డి ఎస్ కిట్లు 800 రూ కు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో ఆత్మ బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ శేషారావు వ్యవసాయ విస్తరణ అధికారి కోటేశ్వరరావు రేణుక గ్రామ వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.




