Addanki: ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితా విడుదల

Addanki: అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో 32 వార్డులు, 49 పోలింగ్ స్టేషన్లతో కూడిన ముసాయిదా జాబితాను మున్సిపల్ కమిషనర్ డి. రవీంద్ర విడుదల చేశారు.

Kolla Singaiah, Addanki
Published on: 10 Sept 2026 5:24 PM IST
Addanki
X

Addanki: ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితా విడుదల

అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణం అద్దంకి మునిసిపల్ కార్యాలయములో నేడు పోలింగ్ స్టేషన్లు ముసాయిదా( మొదటి దశ) పబ్లికేషన్ ను విడుదల చేసిన మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర , పట్టణంలో ప్రస్తుతం ఉన్న 20 వార్డులను 32 వార్డులుగా పెరిగాయి ని అన్నారు.

గతంలో ఉన్న 32 పోలింగ్ స్టేషన్లను 49 పోలీస్ స్టేషన్లో గా పెరిగాయని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో నే ఈ పోలింగ్ స్టేషన్లు నిర్వహించడం జరుగుతుందన్నారు. అద్దంకి పట్టణంలో ప్రస్తుతం 32 వార్డులలో పురుషులు 15278, స్త్రీలు 16611 , తర్జేండర్ 6 మొత్తం 31895 మంది ఓటర్లు ఉన్నారని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.

17 వార్డులలో 1000 మందికి పైబడి ఉన్న ఓటర్లను రెండు పోలింగ్ స్టేషన్లో గా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పొలిటికల్ పార్టీ ల వారితో సమావేశం జరిపిన అనంతరం పబ్లికేషన్ చేసిన కాపీలను జిల్లా కలెక్టర్ కి పంపడం జరుగుతుందన్నారు.

కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర , మేనేజర్ శ్రీదేవి , టౌన్ ప్లాన్ అధికారిని శ్రీలక్ష్మి , ఆర్ఐ బలరాం రెడ్డి మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki