Addanki: డ్రగ్స్‌కు వ్యతిరేకంగా కేరళ యువకుని వినూత్న సైకిల్ యాత్ర
Addanki: డ్రగ్స్‌కు వ్యతిరేకంగా కేరళకు చెందిన సన్నీహిరామ్ సింగిల్ వీల్ సైకిల్‌పై నేపాల్ వరకు సాహస యాత్ర చేపడుతున్నారు. ఈ యాత్ర అద్దంకి మీదుగా సాగింది.
Addanki: డ్రగ్స్‌కు వ్యతిరేకంగా కేరళ యువకుని వినూత్న సైకిల్ యాత్ర
అద్దంకి: అద్దంకి పట్టణం లో వినూత్న సైకిల్ యాత్ర...మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలంటూ... డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఓ యువకుడు చేపట్టిన వినూత్న యాత్ర అద్దంకి మీదుగా కొనసాగుతోంది.కేరళకు చెందిన 32 ఏళ్ల సన్నీహిరామ్... సింగిల్ వీల్ సైకిల్‌పై దేశంలోని పలు రాష్ట్రాలను దాటుకుంటూ నేపాల్‌కు చేరుకునే లక్ష్యంతో యాత్ర చేపట్టారు.కేరళ నుంచి బయలుదేరిన ఆయన... కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా ప్రయాణించి... చివరకు నేపాల్ చేరుకోనున్నారు.
ఇప్పటికే ఏడు రోజులుగా సింగిల్ వీల్ సైకిల్‌పై ప్రయాణిస్తున్న సన్నీహిరామ్... అద్దంకికి చేరుకున్నారు.యువత మాదక ద్రవ్యాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దన్నదే తన యాత్ర ప్రధాన ఉద్దేశమని సన్నీహిరామ్ తెలిపారు. తనను చూసైనా యువత డ్రగ్స్ జోలికి వెళ్లకూడదని... మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ఆయన కోరారు.
ఇక సన్నీహిరామ్ సింగిల్ వీల్ సైకిల్‌పై ప్రయాణం... అద్దంకి రహదారిపై వెళ్తున్న బాటసారులు, వాహనదారులను ఆకట్టుకుంది. వినూత్న సైకిల్‌ను చూసి పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు.డ్రగ్స్‌కు వ్యతిరేకంగా... యువతలో అవగాహన కల్పించేందుకు... సింగిల్ వీల్ సైకిల్ పై వేల కిలోమీటర్ల సాహస యాత్ర చేస్తున్న సన్నీహిరామ్... తన సందేశంతో మరెంత మంది యువతను ప్రభావితం చేస్తుందో చూడాలి మరి.




