Addanki: అద్దంకిలో రూ. 1.30 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి!

Addanki: చెరువుకొమ్ముపాలెంలో బిటి రోడ్డు, కాజ్‌వేను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. 'రెండేళ్ల నమ్మకం' కార్యక్రమంలో పాల్గొని పోషణ కిట్ల పంపిణీ.

Kolla Singaiah, Addanki
Published on: 3 Aug 2026 3:57 PM IST
Addanki
X

Addanki: అద్దంకిలో రూ. 1.30 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి!

అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చెరువుకొమ్ము పాలెంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో గ్రామంలో ప్రజలతో మమేకమై ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం పనితీరుపై అభిప్రాయం తెలుసుకుని అమలు చేసిన కార్యక్రమాలను మంత్రి ప్రజలకు వివరించారు .

అంగన్వాడి సెంటర్ లో పోషణ కిట్లు ను బాలింతలకు అందజేశారు. అనంతరం గ్రామంలో కోటి రూ..తో నిర్మించిన బీటీ రోడ్డును , 30 లక్షల తో కాజ్ వే ను మంత్రి ప్రారంభించారు. మీడియా సమావేశంలో మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ నియోజవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు గ్రామాల్లో సిసి మరియు బీటీ రోడ్లు ఏర్పాటు చేశామన్నారు.

వ్యవసాయ రైతులకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామన్నారు , నూతన విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు పీఎం సూర్యగర్ సోలార్ పవర్ పథకాలను ఎస్సీలకు ఉచితంగా అందించామన్నారు త్వరలో బీసీలకు సబ్సిడీ కింద అందించనున్నామని తెలిపారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story