Addanki: అద్దంకి పీఎస్‌లో వైఎస్సార్సీపీ ఫిర్యాదు
Addanki: వైఎస్సార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహా న్యూస్ వంశీ, శ్రీనివాసరాజులపై చర్యలు తీసుకోవాలని అద్దంకి పీఎస్‌లో వైఎస్సార్సీపీ ఫిర్యాదు.
Addanki: అద్దంకి పీఎస్‌లో వైఎస్సార్సీపీ ఫిర్యాదు
అద్దంకి: పోలీస్ స్టేషన్ నందు వైస్సార్సీపీ ఆధ్వర్యంలో చింతలపూడి అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని, వైఫల్యాలను బయటపెట్టిన ప్రతిసారీ, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపుతోందని మండిపడ్డారు. ఇటీవల జరిగిన డీఎస్సీ పరీక్షల తవ్వకాల్లో ఎలాంటి అక్రమాలు జరిగాయో, అర్హులైన అభ్యర్థులు ఏ విధంగా నష్టపోయారో ప్రజలందరికీ స్పష్టంగా అర్థమవుతోందన్నారు.
డీఎస్సీ అక్రమాలపై వైస్సార్సీపీ ఉద్యమం మొదలుపెట్టగానే కూటమి ప్రభుత్వంలో వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు. అలాగే మొన్న కురిసిన వర్షాలకు అమరావతిలో ఏ విధంగా నీరు చేరిందో, దాన్ని పక్కదారి పట్టించేందుకు గండ్లు కొట్టి పొలాల్లోకి వదలడం వల్ల రైతులు ఎంతలా ఇబ్బంది పడ్డారో అందరూ చూశారని, ఈ వైఫల్యాలన్నింటినీ పక్కత్రోవ పట్టించేందుకే సరికొత్త డ్రామాలకు తెరలేపారని విమర్శించారు.
ఇందులో భాగంగానే మహా న్యూస్ ఛానల్‌కు చెందిన వంశీ అనే వ్యక్తి, అలాగే శ్రీనివాసరాజు అనే వ్యక్తి ప్రజా వేదికలపై, సోషల్ మీడియా వేదికగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ గురించి అత్యంత అవమానకరంగా, అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా సహకరించేందుకే వీరు ఇటువంటి నీచమైన చర్యలకు పాల్పడ్డారని, రానున్న రోజుల్లో వీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
వెంటనే సదరు వీడియో ఆధారాలను పరిశీలించి, మహా న్యూస్ వంశీ, శ్రీనివాసరాజులపై భారతీయ న్యాయ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.




