Addanki: అద్దంకిలో మంత్రి అరాచకాలు సాగవు వైఎస్సార్‌సీపీ నేత చింతలపూడి
Addanki: అద్దంకిలో టీడీపీ బూత్ ఆక్రమణలు, మంత్రి పీఏ దొంగ ఓట్లకు పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తీవ్ర ఆగ్రహం.
Addanki: అద్దంకిలో మంత్రి అరాచకాలు సాగవు వైఎస్సార్‌సీపీ నేత చింతలపూడి
అద్దంకి: అద్దంకి లో 20 ఏళ్లు చరిత్ర చెప్పుకుంటూ రాజకీయం చేస్తున్న నేత మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇలాంటి అరాచక పనులకు పాల్పడడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేసిన అద్దంకి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్.
ఒకటో తేదీ జరిగిన ఎన్నికల్లో బూతుల్లోకి టిడిపి నేతలు చొరబడి వైసిపి ఏజెంట్లను బయటకు పంపించటం, అడిగితే బూతులు మాట్లాడడం చేసిన వాళ్లు ను ఎవ్వరిని వదలమని అద్దంకి పార్టీ కార్యాలయంలోని మీడియా సమావేశంలో చింతలపూడి అశోక్ కుమార్ మాట్లాడారు.
మరి ముఖ్యంగా మంత్రి గారి పిఏ బూతుల్లోకి వెళ్లి దొంగ ఓట్లువేస్తూ ,రిగ్గింగ్ చేయించారని అన్నారు. మంత్రిగారు 22 3 మధ్యలో వచ్చి ఓటు వేసుకొని వెళ్లిన తర్వాత అందరూ రెడీగా ఉండాలని టిడిపి నేతలు గ్రూపులలో మెసేజ్లు ఎందుకు పెట్టుకున్నారు అని ప్రశ్నించారు.
ఈరోజు అరాచకం చేసి మీరు బాగుండవచ్చు , కానీ ముందు కాలంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని టిడిపి నేతలకు చింతల పూడి అశోక్ కుమార్ హెచ్చరించారు.




