Addanki: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్

Addanki: అద్దంకి వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఇంచార్జ్ చింతలపూడి అశోక్ కుమార్. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేస్తామన్న నేత.

Kolla Singaiah, Addanki
Published on: 10 Sept 2026 8:11 PM IST
Addanki
X

Addanki: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్

అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి.. అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం లో పాల్గొన్న ఇంచార్జ్ అశోక్ కుమార్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ముందుకు సాగాలి.. వైసిపి పార్టీ శ్రేణులకు అశోక్ కుమార్ పిలుపు.

అన్ని గ్రామల్లో సర్పంచ్ ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ చేస్తుంది అని స్పష్టం చేసిన అశోక్ కుమార్. తెలుగుదేశం పార్టీ కాదు అది వెన్నుపోటు పార్టీ, కూటమి ప్రభుత్వ పాలన గురించి ప్రజలకు వివరించారు. అధికార పార్టీ దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి.

ఏ కార్యకర్తా భయపడాల్సిన అవసరం లేదు.. అన్నిటికి అండగానేను ఉంటాను అని హామీ ఇచ్చారు. డాక్టర్ అశోక్ కుమార్. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు.. త్వరలో మనకు మంచి రోజులు వస్తాయి. ప్రజలను మోసం చేసేందుకు అధికార పార్టీ అబ్బద్ధపు హామీలతో వస్తోంది.. వాటిని ఎండ కట్టేందుకు సిద్ధం కండి

విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి వైసీపీ కార్యకర్తలు నేతలు అందరూ సమష్టిగా పనిచేయాలిఅని కోరిన ఇన్చార్జి చింతలపూడి అశోక్ కుమార్

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki