Addanki: ఎంపీటీసీల కొనుగోలు ఆడియో విడుదల చేసిన వైఎస్సార్‌సీపీ!

Addanki: అద్దంకిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీల కొనుగోలు ఆడియో కలకలం. నియోజకవర్గ సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్ మీడియా సమావేశంలో వాయిస్ రికార్డింగ్ విడుదల.

Kolla Singaiah, Addanki
Published on: 27 Oct 2026 4:30 PM IST
Addanki
X

Addanki: ఎంపీటీసీల కొనుగోలు ఆడియో విడుదల చేసిన వైఎస్సార్‌సీపీ!

అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం లో ఇటీవల వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తూ కొనుగోలు చేసిన అధికార పార్టీ నేతలపై అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్ మంగళవారం పట్టణంలోని వైసిపి పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అందుకు సంబంధించిన ఒక వాయిస్ రికార్డింగ్ ప్లే చేసి మరి వినిపించారు.

ఈరోజు మూడు గంటలకు ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ ముగిసే ముందు ఈ ఆడియో బయటకు విడుదల చేయటం అద్దంకి పట్టణంలో రాజకీయ నేతల్లో ఓ హాట్ టాపిక్ గా మారింది. అద్దంకి రాజకీయ పరిణామాలు ముందు ముందు ఎలా ఉంటాయనే ది పట్టణ ప్రజలలో చర్చ మొదలైంది.

అద్దంకి పట్టణంలో వార్డులలో పోటీ చేస్తున్న కౌన్సిలర్లకు లక్షలు ఇస్తామని ఎందుకు అధికార పార్టీ నేతలు ప్రలోభాలు చేస్తున్నారు అని ప్రశ్నించిన చింతలపూడి అశోక్ కుమార్ నాతోనే డైరెక్ట్ గా మాట్లాడితే అద్దంకిలో ఐదు లేక ఆరు కోట్లు రూ ...తో వంద పడకల ఆసుపత్రి నిర్మించే వాళ్ళము అది జిల్లాలో నే పేరు వస్తుంది, ఇంకా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనీ అన్నారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki