Dornala: దోర్నాలలో ఎయిడ్స్‌పై కళాజాత బృందంతో విస్తృత అవగాహన!
Dornala: దోర్నాలా బస్టాండ్ సెంటర్‌లో పసుపులేటి రేణుకాదేవి ఆధ్వర్యంలో ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం. కళాజాత బృందం ప్రదర్శనలు, పరీక్షల నిర్వహణ.
Dornala: దోర్నాలలో ఎయిడ్స్‌పై కళాజాత బృందంతో విస్తృత అవగాహన!
Dornala: దోర్నాల బస్టాండ్ సెంటర్‌లో పసుపులేటి రేణుకాదేవి ఆధ్వర్యంలో ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు నిర్వహించనున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా కళాజాత బృందం సభ్యులు పాటలు, ప్రదర్శనల ద్వారా ప్రజలకు ఆకట్టుకునే రీతిలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు. హెచ్‌ఐవీ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధి పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు, వాటిని తొలగించుకోవాల్సిన అవసరంపై వివరించారు.
బస్టాండ్ సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకించారు.అవసరమైన వారికి హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించనున్నట్లు సిబ్బంది తెలిపారు.
ప్రతి ఒక్కరూ హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై సరైన అవగాహన కలిగి ఉండాలని, అపోహలకు గురికాకుండా అవసరమైన సమయంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పీసీకే భవాని, వి.మల్లీశ్వరి, కళాబృందం సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




