Yerragondapalem: యర్రగొండపాలెంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభ!

Yerragondapalem: మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సభ ఘనంగా జరిగింది.

Srikanth Singam, Markapur
Published on: 15 Jun 2026 2:55 PM IST
Yerragondapalem
X

Yerragondapalem: యర్రగొండపాలెంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభ!

Yerragondapalem: యర్రగొండపాలెంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పంచాయతీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు తమ అనుభవాలను, ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా పొందిన ప్రయోజనాలను సభలో వివరించారు. అనంతరం మాట్లాడిన తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఏరిక్షన్ బాబు, కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో యర్రగొండపాలెం నియోజకవర్గం వ్యాప్తంగా అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించిందని తెలిపారు.

ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యాయని, భవిష్యత్తులో కూడా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story