Pedda Dornala: అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇండక్షన్ స్టవ్‌లు అందజేసిన సీడీపీఓ
Pedda Dornala: మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల ఐసిడిఎస్ (ICDS) ప్రాజెక్టు కార్యాలయంలో అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం అందజేసిన ఇండక్షన్ స్టవ్‌లను పంపిణీ చేశారు.
Pedda Dornala: అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇండక్షన్ స్టవ్‌లు అందజేసిన సీడీపీఓ
పెద్ద దోర్నాల: ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పోషకాహార తయారీని మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం అందజేసిన ఇండక్షన్ స్టవ్‌లను పెద్దదోర్నాల మండలంలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు పంపిణీ చేశారు.
పెద్దదోర్నాల అంగన్‌వాడీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సీడీపీఓ లక్ష్మీదేవి, సూపర్వైజర్ అంజమ్మ మండల పరిధిలోని మూడు సెక్టార్లకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇండక్షన్ స్టవ్‌లను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందించే పోషకాహారాన్ని పరిశుభ్రంగా, వేగంగా తయారు చేయడంలో ఇండక్షన్ స్టవ్‌లు ఉపయోగపడతాయని తెలిపారు. ఆధునిక వంట సదుపాయాల ద్వారా కార్యకర్తల కు కూడా సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు.




