Chirala: చీరాలలో జర్నలిస్టు ఫోరం సమావేశం.. నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

Chirala: జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రకటించిన ఫీజు రాయితీని ఇంటర్మీడియట్ వరకు వర్తింపచేయాలని APJF చీరాల నియోజకవర్గ కమిటీ డిమాండ్ చేసింది.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 18 July 2026 10:20 AM IST
Chirala
X

Chirala: చీరాలలో జర్నలిస్టు ఫోరం సమావేశం.. నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

చీరాల: జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థలలో ప్రకటించిన ఫీజు రాయితీని ఇంటర్మీడియట్ వరకు వర్తింపచేయాలని ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్టు ఫోరం చీరాల నియోజకవర్గ కమిటీ కోరింది. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం చీరాల నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో ఫోరం జిల్లా అధ్యక్షులు డి విజయభాస్కర్, సీనియర్ జర్నలిస్ట్ కే ప్రభాకరరావు మాట్లాడారు.

జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన జర్నలిస్టులందరికీ వర్తింపచేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు పి శివ రాజేష్, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు మహా టీవీ చైర్మన్ మారెళ్ళ వంశీకృష్ణ, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు జి.కృష్ణాంజనేయులు, సూచనల మేరకు చీరాల నియోజకవర్గ నూతన కమిటీని ఎన్నుకున్నారు.

నియోజకవర్గాల కమిటీల అనంతరం జిల్లా మహాసభను జరపనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం చీరాల నియోజకవర్గ ఫోరం అధ్యక్ష, కార్యదర్శులుగా వంటరి నాగమణి బాబు (వార్త విలేకరి), దేవరపల్లి దిలీప్ కుమార్ (బిఆర్ కే న్యూస్), ఉపాధ్యక్షులుగా షేక్ బాషా (హెచ్ఎం టివి),

సహాయ కార్యదర్శి ఎలక్ట్రానిక్ మీడియా కన్వీనర్ గా ఎన్ రమేష్ (మహా న్యూస్), కోశాధికారిగా గుమ్మడి సూర్యప్రకాష్ (సివిఆర్), కార్యవర్గ సభ్యులుగా మహమ్మద్ గని భాష, దగ్గుబాటి రాంబాబు (హెచ్ఆర్సి), వేటపాలెం నుండి ఎస్ రాజు(వార్త), దేవరపల్లి దిలీప్ (ఐ న్యూస్) ఎన్నికయ్యారు. సీనియర్ జర్నలిస్ట్ కే ఇజ్రాయిల్ కమిటీ ఎన్నికల అధికారిగా వ్యవహారించారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story