Markapuram: మార్కాపురంలో మున్సిపల్ పోరు రసవత్తరం!

Markapuram: మార్కాపురం మున్సిపల్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతల మధ్య తీవ్ర పోటీ ఆర్యవైశ్య, మైనార్టీ, ఎస్సీ ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 26 Oct 2026 1:41 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురంలో మున్సిపల్ పోరు రసవత్తరం!

Markapuram: మార్కాపురం మున్సిపాలిటీ రాజకీయం రసవత్తరంగా మారింది. మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

టీడీపీ చైర్మన్ అభ్యర్థి వక్కలగడ్డ మల్లికార్జున, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా రాంబాబు ఇద్దరూ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఈ ఎన్నికల్లో ఆ సామాజిక వర్గం ఓటర్ల మద్దతు ఎవరికి లభిస్తుందనే అంశంపై చర్చ సాగుతోంది.

మరోవైపు, వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ కనకదుర్గ పోటీ చేస్తున్నారు. ఆమె విజయానికి అన్నా రాంబాబు కీలకంగా వ్యవహరించాలనే బాధ్యతను పార్టీ నాయకత్వం అప్పగించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మార్కాపురం మున్సిపాలిటీలో ఆర్యవైశ్య ఓటర్లతో పాటు ముస్లిం మైనార్టీ, ఎస్సీ తదితర సామాజిక వర్గాల ఓటర్లు ఎవరికి మద్దతు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సామాజిక సమీకరణాలు, స్థానిక నాయకుల ప్రభావం, అభ్యర్థుల ప్రచారం ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది చర్చనీయాంశంగా ఉంది.

మొత్తంగా మార్కాపురం మున్సిపల్ ఎన్నికల్లో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయి? చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుంది? మెజారిటీ ఎంత వస్తుంది? అన్నది ఎన్నికల ఫలితాలే తేల్చనున్నాయి.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM