Yerragondapalem: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై అవగాహన

Yerragondapalem: పెద్దదోర్నాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఐ వెంకటరమణయ్య ఆధ్వర్యంలో మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు.

Srikanth Singam, Markapur
Published on: 25 July 2026 7:34 PM IST
Yerragondapalem
X

Yerragondapalem: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై అవగాహన

Yerragondapalem: మార్కాపురం జిల్లా పెద్దదోర్నాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఐ వెంకటరమణయ్య ఆధ్వర్యంలో విద్యార్థినీ, విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలు మరియు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటరమణయ్య మాట్లాడుతూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సోషల్ మీడియా, ఆన్‌లైన్ లావాదేవీలలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు ఎవరికీ వెల్లడించవద్దని విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, పోలీసు సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story