Parchur: సీఎంఆర్‌ఎఫ్ సాయంతో ఆగిన వైద్యానికి కొత్త ఊపిరి!
Parchur: బాపట్ల: అనారోగ్యంతో బాధపడుతున్న పర్చూరు మండలం దేవరపల్లి మహిళకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చొరవతో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.1.52 లక్షల ఆర్థిక సాయం.
Parchur: సీఎంఆర్‌ఎఫ్ సాయంతో ఆగిన వైద్యానికి కొత్త ఊపిరి!
Parchur: నొప్పి భరించలేక ఆమె అల్లాడుతుంటే.. ఆ నొప్పికి మించిన ఆందోళన ఆ కుటుంబాన్ని కమ్మేసింది- డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని అర్థం కానీ పరిస్థితిలో స్థానిక నేతల సహకారంతో ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే ఆర్థిక సాయం అందించేలా ప్రత్యేక చొరవ చూపారు!
అసలు కథ ఇలా....దేవరపల్లి కి చెందిన అలూరి కౌసల్య గుంటూరులోని ఆర్కే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నా, ఖర్చుల భారం ఆ కుటుంబాన్ని కుంగదీసింది. వైద్యానికి సరిపడా డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులతో ఉన్న కుటుంబానికి ఎమ్మెల్యే ఏలూరి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకునేందుకు చర్యలు చేపట్టారు. ఆగ మేఘాల మీద ముఖ్యమంత్రి సహాయనిధికి లేఖ రాసి...ఆర్థిక సాయం అందేలా కృషి చేశారు.
సమస్య తెలిసిన వెంటనే స్పందన
కౌసల్య కుటుంబం పడుతున్న ఆవేదన ఎమ్మెల్యే దృష్టికి రాగానే, ఆయన ఏమాత్రం జాప్యం చేయలేదు. వెంటనే ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా ఆర్థిక సాయం మంజూరు చేయాలంటూ నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. ఒక సామాన్య మహిళ కష్టాన్ని అంత సీరియస్‌గా తీసుకుని, ఉన్నత స్థాయిలో విజ్ఞప్తి చేయడం వెనుక ఆయనలోని మానవీయ కోణం స్పష్టంగా కనిపిస్తుంది.
ఫలించిన విజ్ఞప్తి.. లభించిన ఊరట
ఎమ్మెల్యే విన్నపాన్ని పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కార్యాలయం, కౌసల్య చికిత్స కోసం రూ.1,52,249 విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ)ని మంజూరు చేసింది. ఆర్థిక భారంతో సతమతమవుతున్న ఆ కుటుంబానికి ఇది కంటిమీద కునుకు లేకుండా చేసిన ఆందోళనకు తెరదించింది.
వైద్యం ఆగకూడదు" అనే సంకల్పంతో..
పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరి చికిత్సా నిలిచిపోకూడదన్న సంకల్పంతో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా అర్హులైన వారికి సాయం అందిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చే వైద్య సహాయ అభ్యర్థనలను స్వయంగా పరిశీలించి, సత్వర సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఏలూరి వెల్లడించాయి. ఈ ఎల్ఓసి చెక్కును స్థానిక నేతలు కుటుంబానికి అందజేశారు. తక్షణమే స్పందించి ఎల్ఓసి అందేలా కృషిచేసిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు కుటుంబ సభ్యులు స్థానిక నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.




