Bestavaripeta: బేస్తవారిపేటలో స్థానిక ఎన్నికలకు పటిష్ట భద్రత

Bestavaripeta: మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలంలో స్థానిక ఎన్నికల దృష్ట్యా 144 సెక్షన్ అమలు చేశారు. 19 సర్పంచ్, 15 ఎంపీటీసీ స్థానాలకు భద్రతా ఏర్పాట్లు పూర్తి.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 19 Oct 2026 6:33 PM IST
Bestavaripeta
X

Bestavaripeta: బేస్తవారిపేటలో స్థానిక ఎన్నికలకు పటిష్ట భద్రత

మార్కాపురం జిల్లా: బేస్తవారిపేట మండలంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్ జితేంద్ర, ఎంపీడీవో రంగనాయకులు, ఎస్సై రవీంద్రారెడ్డి తెలిపారు.

స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో బేస్తవారిపేట మండల పరిధిలో 19 సర్పంచ్ స్థానాలకు, 15 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపడుతూ, ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU