Ongole: ఒంగోలులో బి కె యం యు జాతీయ మీటింగ్స్.. డి. రాజా ఎంట్రీ!
Ongole: ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో మే 28 నుండి 30 వరకు భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ (BKMU) జాతీయ సమితి సమావేశాలు జరగనున్నాయి.
Ongole: ఒంగోలులో బి కె యం యు జాతీయ మీటింగ్స్.. డి. రాజా ఎంట్రీ!
Ongole: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలులో మే 28 నుండి 30 వరకు భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ సమితి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు బి కె యం యు జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు ఒక ప్రకటన తెలిపారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు కేంద్ర ,రాష్ట్రాల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, భూమి పంపకం ,ఉపాధి, సంక్షేమ పథకాలు , ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలపై మహిళలపై జరుగుతున్న దాడులు, సామాజిక న్యాయం సాధన తదితర అంశాలపై సమావేశాల్లో చర్చించబడతాయన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన వి బి జి రామ్ జి రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి అమలు జరపాలి అనే అంశంపై 28 తేదీ ఉదయం 11 గంటలకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సెమినార్ లో పలువురు ప్రముఖులు మేధావులు వ్యవసాయ రంగ నిపుణులు పాల్గొంటారన్నారు. జాతీయ సమితి సమావేశాలు 28 వ తేదీ సాయంత్రం 3 గంటలకు ప్రారంభమై 30వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. ఈ సమావేశాలలో దేశవ్యాప్తంగా కోట్లాదిమంది వ్యవసాయ కార్మికుల ప్రయోజనాల కోసం ఇంతవరకు నిర్వహించిన ఉద్యమాలను సమీక్షించుకొని భవిష్యత్తు పోరాట కార్యక్రమాలను రూపొందించడం జరుగుతుందన్నారు. గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు వ్యవసాయ కార్మిక సంఘ నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక నిర్ణయించబడుతుందన్నారు.
సమావేశాలకు ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, కార్యదర్శి కె. రామకృష్ణ హాజరవుతున్నారన్నారు. బి కెయంయు అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు యన్. పెరియా సామి, గుల్జారి సింగ్ గోరియా, దేశ నలుమూలల నుండి వివిధ రాష్ట్రాల అధ్యక్ష, కార్యదర్శులు ,జాతీయ సమితి సభ్యులు, ఆహ్వానితులు పాల్గొంటున్నారని తెలిపారు. వ్యవసాయ కార్మికోద్యమ చరిత్రలో మైలురాయిగా నిలువనున్న సమావేశాలను అన్ని విధాల జయప్రదం చేయాలని వెంకట్రాములు పిలుపునిచ్చారు.




