Markapuram: మార్కాపురం నూతన కలెక్టరేట్‌కు ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

Markapuram: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో మార్కాపురం జిల్లా నూతన సమగ్ర కలెక్టరేట్ కార్యాలయాల భవన నిర్మాణాల ఆమోదం.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 23 Jun 2026 9:45 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం నూతన కలెక్టరేట్‌కు ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

Markapuram: మార్కాపురం జిల్లా అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌తో పాటు ఇతర జిల్లా అధికారుల కార్యాలయాల సముదాయం నిర్మాణం కోసం మార్కాపురం మండలం గోగులదిన్నె గ్రామ పరిధిలో 20.01 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ రాష్ట్ర క్యాబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది.

ప్రస్తుతం ఏర్పాటు చేసిన తాత్కాలిక కలెక్టరేట్ సముదాయానికి ఎదురుగా ఉన్న భూమిని ఈ నిర్మాణాల కోసం కేటాయించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది.

మార్కాపురం జిల్లా ఏర్పాటు కోసం కృషి చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, నూతన కలెక్టరేట్ నిర్మాణం కోసం భూమి కేటాయింపుపై ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులతో పలుమార్లు చర్చించిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడినట్లు సమాచారం.

కేటాయించిన భూమిలో సర్వే నంబర్లు 90, 91, 92, 98-2, 99-2, 99-5, 100, 101 పరిధిలోని మొత్తం 20.01 ఎకరాలు ఉన్నాయి. ఈ భూమిపై కలెక్టరేట్‌తో పాటు వివిధ జిల్లా స్థాయి కార్యాలయాల సముదాయాన్ని నిర్మించనున్నారు.

ఈ నిర్ణయంతో జిల్లా పరిపాలన మరింత సమర్థవంతంగా సాగడంతో పాటు భవిష్యత్‌లో మార్కాపురం జిల్లా అభివృద్ధికి బలమైన పునాది పడుతుందని ప్రజలు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రివర్గానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మరియు జిల్లా ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story