Naguluppalapadu: నాగులుప్పలపాడు మండలంలో షార్ట్‌సర్క్యూట్‌తో పశువుల పాక దగ్ధం!

Naguluppalapadu: నాగులుప్పలపాడు మండలం బి.నిడమానూరులో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో పశువుల పాక దగ్ధం. మంటల్లో చిక్కుకుని ఎద్దుకు తీవ్ర గాయాలు, రూ.2 లక్షల నష్టం.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 22 Sept 2026 11:39 AM IST
Naguluppalapadu
X

Naguluppalapadu: నాగులుప్పలపాడు మండలంలో షార్ట్‌సర్క్యూట్‌తో పశువుల పాక దగ్ధం!

Naguluppalapadu: నాగులుప్పలపాడు మండలంలోని బి.నిడమానూరు గ్రామంలో సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం సమయంలో పశువుల పాక దగ్ధమైంది. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు బాధిత రైతులు తెలిపారు.

గ్రామానికి చెందిన నంబూరి రామయ్య, బత్తుల ఆదిశేషులకు చెందిన రెండు ఎద్దులను వర్షం నుంచి రక్షించేందుకు అదే గ్రామానికి చెందిన ఓరుగంటి వెంకటేశ్వరరెడ్డి పశువుల పాకలో కట్టారు.

వర్షం సమయంలో పాకలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒక ఎద్దు తప్పించుకుని బయటపడగా. మరో ఎద్దు మంటల్లో చిక్కుకుని శరీరంలో కొంత భాగం కాలిపోయి తీవ్రంగా గాయపడింది. పశువుల పాక పూర్తిగా దగ్ధమైంది.ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు.

వ్యవసాయ పనులకు ఉపయోగించే ఎద్దు తీవ్రంగా గాయపడటంతో పేద రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam