Cheemarkurthi: చీమకుర్తిలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు - చెక్కుల అందజేత
Cheemarkurthi: చీమకుర్తి మున్సిపల్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్. మహిళలకు రూ.7.94 కోట్ల మెప్మా రుణాలు.
Cheemarkurthi: చీమకుర్తిలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు - చెక్కుల అందజేత
చీమకుర్తి: 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చీమకుర్తి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ. బి. ఎన్. విజయ్ కుమార్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని, వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని అన్నారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని పేర్కొన్నారు. దేశ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
అనంతరం చీమకుర్తి మున్సిపాలిటీలో ఉత్తమ సేవలు అందించిన మున్సిపల్ అధికారులు, మెప్మా సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులను ఎమ్మెల్యే అభినందించి సేవా పురస్కారాలను అందజేశారు.
అదేవిధంగా చీమకుర్తి మున్సిపాలిటీలోని 53 గ్రూపులకు చెందిన 530 మంది మహిళలకు మెప్మా ద్వారా రూ.7.94 కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కును మెప్మా సిబ్బందికి ఎమ్మెల్యే బి. ఎన్. విజయ్ కుమార్ అందజేశారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి కుటుంబ, సామాజిక అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, మెప్మా సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




