Chimakurthi: చీమకుర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు
Chimakurthi: చీమకుర్తి టీడీపీలో టికెట్ల రగడ రాజుకుంది. చైర్పర్సన్ పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన సొసైటీ చైర్మన్ పూనాటి వెంకట్రావు రెబల్గా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు.
Chimakurthi: చీమకుర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు
చీమకుర్తి: చీమకుర్తి తెలుగుదేశం పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. పార్టీ సీనియర్ నాయకుడు, సొసైటీ చైర్మన్ పూనాటి వెంకట్రావు సంచలన ప్రకటన చేశారు. పార్టీ కోసం 40 ఏళ్లుగా అంకితభావంతో పనిచేసిన తనకు ప్రస్తుతం అన్యాయం జరుగుతోందంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
చైర్పర్సన్ పదవి దక్కకపోవడమే అసంతృప్తికి కారణమా
చీమకుర్తి మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవి తనకు కేటాయించకపోవడంపై పూనాటి వెంకట్రావు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో పార్టీకి దూరంగా ఉన్న కొందరు నాయకులకు ప్రాధాన్యత ఇస్తూ, తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.
స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రకటన!
మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధిస్తానని పూనాటి వెంకట్రావు ప్రకటించారు. అంతేకాదు, చీమకుర్తి మున్సిపాలిటీ చైర్పర్సన్ స్థానాన్ని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కానుకగా అందిస్తానని ధీమా వ్యక్తం చేసినట్లు వెల్లడించారు.




